జాతీయ వార్తలు

బీసీ బిల్లు పెట్టాలి బీసీ సంఘాల డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ జాతీయ బీసీ సంక్షేమ సఘం నేతృత్వంలో గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన అగ్ర కులాలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో స్వల్ప వ్యవధిలోనే బిల్లును పెట్టి రిజర్వేషన్లు కల్పించారని.. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని గత 30 సంవత్సరాలుగా పొరాడుతున్నా ఇంతవరకు ఒక్క రాజకీయ పార్టీ కూడా పట్టింకోవడం లేదని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, బీసీ సంఘాల నాయకులు మద్విరాజ్, మహేందర్ కేసరి తదితరులు పాల్గొన్నారు.