జాతీయ వార్తలు

మీ హృదయం ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహారాజ్‌గంజ్ (ఉత్తరప్రదేశ్), మే 16: ప్రధాని నరేంద్ర మోదీ 56 అంగుళాల ఛాతీ గురించి గొప్పగా చెప్పుకొంటున్నారని, అయితే, అందులో ఆయన హృదయం ఎక్కడ ఉందో చెప్పాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.
మహారాజ్ గంజ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుప్రియా ష్రినాటే తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ మోదీ పదేపదే తన ఛాతీ విస్తీర్ణం 56 అంగుళాలు అంటూ గొప్పగా చెప్తున్నారని, కానీ, అందులో హృదయం మాత్రం లేదని వ్యాఖ్యానించారు. దేశభక్తి అంటే పాకిస్తాన్ గురించి మోదీ మాట్లాడతారని, ఆ దేశం ఏం చేసినా పొరపాటే అనడం ఆయన నైజమని ప్రియాంక విమర్శించారు. ఎంత సేపూ పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నారే తప్ప రైతుల గురించిగానీ, నిరుద్యోగ సమస్య గురించిగానీ ఎందుకు మాట్లాడడం లేదని మోదీని నిలదీశారు. దేశభక్తి అంటే పాకిస్తాన్‌ను విమర్శించడం ఒక్కటే కాదని ప్రియాంక అన్నారు. మొండి వైఖరి అలంభిస్తూ, ఏపక్షంగా వ్యవహరిస్తూ మోదీ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. గత ఐదేళ్ల మోదీ పాలన రైతు సంక్షేమానికి వ్యతిరేకంగానే కొనసాగిందని అన్నారు. రైతుల గురించి సర్కారు ఏమీ పటించుకోవడం లేదన్నారు. కిసాన్ సమ్మాన్ పథకం పేరుతో రైతు కుటుంబానికి, ఏడాదికి 6,000 రూపాయలు ఇస్తామని బీజేపీ గొప్పగా ప్రకటిస్తున్నదని, అంటే, రోజుకు వారికి ఇచ్చేది కేవలం రెండు రూపాయలు మాత్రమేనని అన్నారు. కాంగ్రెస్ అమలు పరచబోయే ‘న్యాయ్’ పథకం కింద ప్రతి పేద కుటుంమానికీ, ఏడాదికి 72,000 రూపాయలు లభిస్తాయన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోతున్నదని ప్రియాంక అన్నారు. గత ఐదేళ్ల కాలంలో సుమారు ఐదు కోట్ల ఉద్యోగాలను బీజేపీ సర్కారు లేకుండా చేసిందన్నారు. అంతేగాక, వివిధ ప్రభుత్వ శాఖల్లో 24 లక్షల ఖాళీలు ఉన్నప్పటికీ, వాటిని భర్తీ చేసే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు, ప్రజలు కోరుకున్న, ప్రజాస్వామిక పాలన వస్తుందని వ్యాఖ్యానించారు.