జాతీయ వార్తలు

ఖేల్ రత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్టప్రతి భవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డును రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ నుంచి స్వీకరిస్తున్న తెలుగు అమ్మాయ, బాడ్మింటన్ సూపర్ స్టార్ పివి సింధు. ఆమెతోపాటు రెజ్లర్ సాక్షి మాలిక్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, షూటర్ జీతూ రాయ్‌లకు కూడా ఖేల్ రత్న అవార్డును రాష్టప్రతి బహూకరించారు. సింధు 2013, 2014 సంవత్సరాల్లో ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాలను కైవసం చేసుకుంది. మకావూ ఓపెన్ గ్రాండ్ ప్రీ టైటిల్‌ను వరుసగా మూడు పర్యాయాలు గెల్చుకొని హ్యాట్రిక్ నమోదు చేసింది. ఆమె సాధించిన ఎన్నో విజయాల్లో ఇవి కొన్ని మాత్రమే. అందుకే, కేవలం 18 ఏళ్ల ప్రాయంలోనే ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డు ఆమెను వరించింది. ఇప్పుడు అత్యున్నత క్రీడా పురస్కారం ఆమె ఖాతాలో చేరింది.