జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, మే 16: పుల్వామా జిల్లాలో గురువారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో ఒక జవాను, మరో పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు ఒక ఇంట్లో మాటువేసి ఉన్నారన్న పక్కా సమాచారం మేరకు భద్రతా దళాలు గురువారం పుల్వామా జిల్లాలోని డేలిపొరా ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు ఉన్న ఇంటి పరిసర ప్రాంత ప్రజలను ఖాళీచేయిస్తున్న క్రమంలో బలగాలపై కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నట్లు పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముందుగా ఆర్మీజవాను సందీప్, రరుూస్‌దర్ అనే పౌరుడు మరణించడంతో బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు జైషే తీవ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులను పుల్వామా జిల్లాలోని కరీమాబాద్‌కు చెందిన నజీర్ పండిత్, షోపియాన్‌కు చెందిన ఉమర్‌మీర్, పాకిస్తాన్‌కు చెందిన ఖాలిద్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా జైషే మహమ్మద్ సంస్థకు చెందినవారని పోలీసు రికార్డుల్లో ఉందన్నారు. పౌరులు, సైనిక స్థావరాల లక్ష్యంగా వరుస దాడులు చేసేందుకు పన్నాగం పన్నారని పేర్కొన్నారు. ఉగ్రవాద సంస్థలో చేరకముందే నజీర్ పండిత్ చాలాకాలంనుంచి ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్నాడని, చాలా కేసులు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు. 2018లో మహమ్మద్ యాకూబ్ షా అనే పోలీసు హత్య కేసులో నజీర్ పాత్ర కూడా ఉందనీ, పలు ఆయుధాల చోరీ కేసుల్లో కూడా నిందితుడని తెలిపారు. ఖాలిద్ జైషే కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడని, వరుస పేలుళ్లతో భయోత్పాతం సృష్టించాలనే లక్ష్యంతో ఇక్కడ మాటువేశారని పోలీసులు తెలిపారు.
చిత్రం...పుల్వామాలో గురువారం ఉగ్రవాదులపై కాల్పులు జరుపుతున్న భద్రతా దళాలు