జాతీయ వార్తలు

రీపోలింగ్‌పై టీడీపీ అభ్యంతరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి శాసనసభ స్థానంలో ఐదు పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్‌పై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పశ్ఛిమ బెంగ్‌ల్‌లో హింసాత్మక ఘటనలు, ఆంధ్రప్రదేశ్‌లో రీపోలింగ్ తదితర అంశాలపై కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, కంభపాటి రామ్మోహన్‌రావు, ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్ గురువారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈసీకి వినతిపత్రం అందజేశారు. తరువాత ఈసీ కార్యాలయం ఎదుట సీఎం రమేష్ మాట్లాడుతూ వైకాపా కోరిన వెంటనే విచారణ లేకుండానే రీపోలింగ్‌కు నిర్ణయించారని ఆరోపించారు. చంద్రగిరి వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఫిర్యాదును ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారని ప్రశ్నించారు. చంద్రగిరిలో ఆ ఐదు పోలింగ్ బూత్‌లు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే అక్కడ రీ పోలింగ్ పెట్టారని విమర్శించారు. ఎన్నికల సంఘం నిబంధనలు పాటించకుండా బీజేపీ కనుసన్నల్లో కొనసాగుతూ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు. ఈసీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలపై కొత్త ప్రభుత్వంలో పార్లమెంట్‌లో చర్చకు వచ్చేలా చూస్తామని రమేష్ హెచ్చరించారు. టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్‌రావు మాట్లాడుతూ ఈసీ నిర్ణయాలు బీజేపీ, వైకాపాకు అనుకూలంగా ఉన్నాయని ఆరోపించారు. ఏపీలో ఎన్నికలు జరిగి 34 రోజుల తరువాత ఇప్పుడు రీపోలింగ్ జరపడం సరైంది కాదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి అన్నారు. ఈసీని కలిసిన తరువాత ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రీపోలింగ్‌పై ఎన్నికల సంఘం విచారణ నిర్వహించిన తరువాతే రీ పోలింగ్ జరపాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ఏపీలో ఇవేమీ లేకుండా రీపోలింగ్‌పై ఎన్నికల సంఘం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆరోపించారు.
చిత్రం...ఢిల్లీలో గురువారం ఎన్నికల సంఘంతో సమావేశం అనంతరం వెలుపలకు వస్తున్న కాంగ్రెస్ ప్రతినిధి బృందం