జాతీయ వార్తలు

చంద్రబాబు హంగ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 18: పదిహేడవ లోక్‌సభ ఎన్నికల్లో హంగ్ పార్లమెంటు ఏర్పడే పక్షంలో ప్రతిపక్షాలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. శనివారం ఢిల్లీలో రాహుల్ గాంధీతోపాటు సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, కార్యదర్శి డీ.రాజా, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, సీనియర్ నాయకుడు శరద్ యాదవ్‌తో చంద్రబాబు మంతనాలు జరిపారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు గురించి చర్చించేందుకు యుపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ నెల 23న ఏర్పాటు చేసిన సమావేశానికి ఇతర ప్రతిపక్ష నాయకులు రావటం కుదరకపోవటంతో ఈ సమావేశాన్ని వాయిదా వేశారు. ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల నాయకుల సమావేశం ఏర్పాటు చేసే బదులు ఫలితాలు వచ్చేలోగా వీరందరితో విడివిడిగా చర్చలు జరిపి ఒక వ్యూహాన్ని సిద్ధం చేయాలనే ఆలోచనతోనే చంద్రబాబు ఈ నాయకులందరినీ కలుస్తున్నారు. రాహుల్ గాంధీ, శరద్ పవార్‌తో జరిపిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు చంద్రబాబు శనివారం సాయంత్రం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు వెళ్లి బీఎస్పీ అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో మంతనాలు జరిపారు. అవసరమైతే కోల్‌కతాకు వెళ్లి తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు గురించి చర్చలు జరపనున్నారు.
చంద్రబాబు శనివారం రాహుల్ గాంధీ, శరద్ పవార్‌తో జరిపిన చర్చల్లో పదిహేడవ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండవచ్చు.. ఎవరికి ఎన్ని సీట్లు రావచ్చు అనేది సమీక్షించినట్లు ప్రతిపక్ష వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ పూర్తి మెజారిటీతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెబుతుంటే రాహుల్ గాంధీ, చంద్రబాబు తదితర ప్రతిపక్షం నాయకులు మాత్రం బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏకు రెండు వందల కంటే ఎక్కువ సీట్లు రావని భావిస్తున్నారు. లోక్‌సభలోని మొత్తం 543 సీట్లలో ఎన్‌డీఏ 200 సీట్లు పోను మిగతా సీట్లన్నీ ప్రతిపక్ష పార్టీలకు వస్తాయి కాబట్టి.. అందరినీ కలుపుకుపోతే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చునని ప్రతిపక్షం సీనియర్ నాయకులు అంచనా వేస్తున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోని యుపీఏ తోపాటు శరద్ పవార్,
మాయావతి, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ ఒకటైతే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆత్యంత సునాయసంగా ఏర్పాటు చేయవచ్చునని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ లక్ష్య సాధన కోసమే ఆయన మాయావతి, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీతో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఏర్పాటు చేసే సంకీర్ణ ప్రభుత్వమే సుస్థిరంగా ఉంటుంది.. ఐదు సంవత్సరాలపాటు కొనసాగ గలుగుతందని చంద్రబాబు భావిస్తున్నారని అంటున్నారు. ప్రతిపక్షంలోని ఇతర సీనియర్ నాయకులు ఎవరు ప్రధాన మంత్రి పదవి చేపట్టినా సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో కొనసాగలేదన్నది ప్రతిపక్షం సీనియర్ నాయకుల అంచనా.
చిత్రాలు.. ఢిల్లీలో శరద్ పవార్, లక్నోలో మాయావతితో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు