జాతీయ వార్తలు

చిత్తూరు కలెక్టర్‌పై చర్యలు తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 18: ఆంధ్రప్రదేశ్‌లో కౌంటింగ్ పారదర్శకంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. ఆ పార్టీ నాయకుల బృందం శనివారం సీఈసీని కలిసి ఒక వినతిపత్రం సమర్పించారు. చంద్రగిరి నియోజకవర్గం ఎన్నికల్లో జరిగిన అవకతవకల వ్యవహరంలో చిత్తూరు కలెక్టర్ ప్రద్యుమ్నపైనా, రాప్తాడు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిపైనా చర్యలు తీసుకోవాలని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కౌంటింగ్ ప్రశాంత వాతావరణలో నిర్వహించే విధంగా అదనపు కేంద్ర బాలగాలను మోహరించాలని కూడా
వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ సమావేశం అనంతరం ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అక్రమాలకు పాల్పడిన విషయాన్ని మరోసారి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ముఖ్యమంత్రి తన పేషీలో పనిచేసిన ఐఎఎస్ అధికారిని చిత్తూరు కలెక్టర్‌గా నియమించుకుని ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో తెలుగుదేశం పార్టీ అక్రమాలపై విచారణ జరిపిన ఎన్నికల అధికారిని కలెక్టర్ బెదిరించారని ఆరోపించారు. అక్కడ రిగ్గింగ్ జరగలేదని ఆ అధికారి చేత కలెక్టర్ రాయించారని ఆరోపించారు. ఎన్నికలు పూర్తియినా తరువాత 12వ తేదీన చంద్రగిరి వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఏడు పోలింగ్ బూత్‌లపై ఫిర్యాదు చేశారని ఆయన గుర్తుచేశారు. రిగ్గింగ్ జరిగిన కేంద్రాల్లో సీసీటీవీ పుటేజ్‌లను చూడాలని కోరినా కలెక్టర్ పట్టించుకోలేదని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడంతో ఉన్నత అధికారులు ఈ ఫుటేజీలు చూసిన తరువాత రీపోలింగ్‌కు ఆదేశించారని చెప్పారు. 2014 ఎన్నికల్లో కూడా ఈ ఐదు పోలింగ్ బూత్‌ల్లో ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీకే పడ్డాయని వెల్లడించారు. ఒక్క ఓటు కూడా ఏ రాజకీయ పార్టీకి పడలేదని చెప్పారు. అలాగే ఎన్నికల పోలింగ్ ముందు మాక్ పోలింగ్ జరిగినప్పుడు ఈవీఎంలు, వీవీప్యాట్లలో స్లిప్‌లు తొలగించకపోతే, కౌంటింగ్ రోజున పడిన ఓట్లకు వీవీప్యాట్లలో స్లిప్‌ల లెక్కింపులో తేడాలు వస్తాయని, దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. అనంతపురం జిల్లా రాప్తాడుకు సంబంధించి ఎన్నికల అధికారి స్థానిక మంత్రి సునీతకు తొత్తుగా వ్యవహరించి ఎన్నికల రోజు ఆక్రమాలకు పాల్పడ్డారని, ఆయనను విధుల నుంచి తక్షణమే తొలిగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి చెందినవారు ఎన్నికల లెక్కింపు రోజున శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా కుట్రలు చేస్తున్నారని, ఈ విషయాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఏపీలో కౌంటింగ్ రోజునాడు ఏపీ పోలిసులతోపాటు సెంట్రల్ పోలీసులను కూడా నియమించాలని, చిత్తూరు జిల్లా కలెక్టర్‌ను, రాప్తాడులో ఎన్నికల అధికారులను తొలిగించాలని సీఈసీని కోరినట్టు విజయ సాయిరెడ్డి తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వ్యక్తిత్వం లేని రాజకీయ నాయకుడని అభివర్ణించిన ఆయన వైకాపాపై చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. అంతకముందు ఆ పార్టీ సీనియర్ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అధికారం లేనిదే ఆయన జీవితం గడిచే పరిస్థితి లేదని పేర్కొన్నారు. సీఈసీని కలిసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందంలో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బుట్టారేణుక, పండుల రవీంద్రబాబు, అవంతి శ్రీనివాస్ తదితరులున్నారు.

చిత్రం...ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశం అనంతరం వెలుపలకు వస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు