జాతీయ వార్తలు

వారణాసి ఎటువైపో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసి: పూజాది కార్యక్రమాలకు ఎల్లవేళలా సిద్ధంగా ఉండే ఘాట్స్ నుంచి అందంగా తీర్చిదిద్దిన విద్యుత్ కాంతుల వరకు..ఎగుడు, దిగుడు లేని నాలుగు లైన్ల రోడ్డు నుంచి క్యాన్సర్ ఆసుపత్రి వరకు..విశే్వశ్వరుడి గుడి నుంచి మురికి కూపంగా కనిపించే మురికివాడల వరకు..దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన వారణాసిలో భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, మత విశ్వాసాలు స్పష్టంగా గోచరిస్తాయి. గత ఐదేళ్లలో వారణాసి చాలానే అభివృద్ధి చెందింది. మరోసారి ఇక్కడ నుంచి గెలవాలన్న ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ అభ్యర్థిగా పోటీకి దిగారు. కాగా, ఆయనతో పోటీ పడతానంటూ చివరివరకు చెప్పి, ఆ తర్వాత పోటీలో లేనని ప్రకటించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భారీ రోడ్ షోలతో జనాన్ని ఆకట్టుకున్నారు. తాను బరిలో లేకపోయినా కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌ని గెలిపించడానికి శక్తివంచన లేకుండా ఆమె కృషి చేశారు. మరోవైపు బహుజన సమాజ్‌వాది పార్టీ (బీఎస్పీ) కూడా సమర్థించిన సమాజవాది పార్టీ అభ్యర్థి షాలినీ యాదవ్ కూడా గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. నరేంద్ర మోదీ ఎన్నిక నల్లేరుపై నడకేనని బీజేపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే, అదంత సులభం కాదని, ఇటీవల ఆయన తీసుకున్న పలు వివాదాస్పద నిర్ణయాలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ నమ్ముతోంది. ప్రియాంక గాంధీ ప్రచారం తమకు కలిసివస్తుందని ఆశిస్తోంది. మరోవైపుదళిత బహుజన ఓట్లు తమకే దక్కుతాయని ఎస్పీ అభ్యర్థి షాలినీ ధీమాతో ఉన్నారు. ఆదివారం పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయి, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ వాదన ప్రకారం స్థానికుల మద్దతు మోదీకే ఉంది. 2014తో పోలిస్తే వారణాసి కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చెందింది. విశాలమైన రోడ్లు, దేశవిదేశాల నుంచి కాశీని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. పూజాది కార్యక్రమాలు జరిపే గంగానది ఒడ్డున గల ఘాట్స్‌ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. గతంలో నామమాత్రంగా జరిగే గంగా పూజలు కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అటు భక్తులకు, ఇటు సామాన్యులకు అన్నివిధాల సౌకర్యాలు కల్పించిన మోదీ మరోసారి గెలిస్తే వారణాసి మరింత అభివృద్ధి చెందుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇది బీజేపీ అభిప్రాయమైతే, కాంగ్రెస్ అందుకు భిన్నమైన వాదనలు చేస్తోంది. ఘాట్స్ వద్ద ప్రత్యేక నిర్మాణాలేవీ జరగలేదని వాదిస్తోంది. గంగా నది ప్రక్షాళన అంటూ ఊదరగొట్టిన మోదీ ఆ విషయాన్ని పూర్తిగా మరచిపోయారని కాంగ్రెస్ ఆరోపించింది. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి అకస్మాత్తుగా ఏమీ మారిపోలేదని విమర్శిస్తోంది. ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారాలకు ప్రతిసారీ భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడమే అక్కడ చోటుచేసుకోబోయే మార్పులను సూచిస్తోందని కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది. ఇక్కడ విజయం తమదేనని అంటోంది. మోదీని ఓడించడం కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌కు దాదాపుగా అసాధ్యమని విశే్లషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, గతంతో పోలిస్తే మోదీకి మెజారిటీ తగ్గే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఇలావుంటే, బీజేపీ, కాంగ్రెసేతర కూటమి అంటూ ఎన్నికల ముందు హడావుడి చేసిన బీఎస్పీ, ఎస్పీ పార్టీలు చివరకు రాష్ట్రీయ జనతాదళ్ తప్ప మరే పార్టీతోనూ కూటమిగా ఏర్పడలేకపోయింది. దళితులు, బహుజనులు, మైనారిటీల ఓటు బ్యాంకుపైనే ఎస్పీ అభ్యర్థి షాలినీ యాదవ్ నమ్మకం పెట్టుకున్నారు. ఏదేమైనా మోదీ విజయం ఖాయమని, రెండు, మూడు స్థానాల్లో ఎవరు ఉంటారనేదే ఆసక్తి రేపుతోందన్న వాదన బలంగా వినిపిస్తోంది.