జాతీయ వార్తలు

కేదార్‌నాథ్ ఆలయంలో ప్రధాని పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేదార్‌నాథ్ (ఉత్తరాఖండ్), మే 18: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసిన మరుసటి రోజు శనివారం కేదార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శనివారం ఉదయం జోలిగ్రాంట్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని, అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి వచ్చారని అధికారులు తెలిపారు. సంప్రదాయ దుస్తులు ధరించిన మోదీ సుమారు అరగంట సేపు ఆలయంలో పూజలు చేశారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ప్రధాని తరువాత కొంతసేపు ధ్యానం చేశారు. 2013లో కురిసిన కుండపోత వర్షాల వల్ల కేదార్‌నాథ్ పట్టణం తీవ్రంగా దెబ్బతిన్నది. మోదీ గత రెండు సంవత్సరాలలో కేదార్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకొని, ఇందులో కొలువుదీరిన శివుడికి పూజలు చేయడం ఇది నాలుగోసారి. మోదీ ఆదివారం బద్రీనాథ్‌లో ప్రత్యేక పూజలు చేస్తారు. శీతాకాలంలో మూసివేసిన ఈ రెండు ఆలయాల మహాద్వారాలను ఈ నెల మొదట్లో తిరిగి తెరిచారు. ప్రధాని మోదీ కేవలం ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా ఉత్తరాఖండ్‌కు వచ్చారని బీజేపీ ఉత్తరాఖండ్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ భట్ తెలిపారు. ప్రధాని రాక వల్ల కేదార్‌నాథ్ పట్టణంలో, ఆలయం వద్ద పటిష్టమయిన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు డీజీపీ (శాంతి భద్రతలు) అశోక్ కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఇంకా అమలులో ఉన్నదనే విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయానికి గుర్తు చేస్తూ, ఎన్నికల సంఘం ఈ పర్యటనకు అనుమతి ఇచ్చింది.