జాతీయ వార్తలు

ఇందిరా గాంధీలా నన్ను చంపుతారేమో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 18: బీజేపీ తన అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నిస్తోందని, మాజీ ప్రధాని ఇందిరా గాంధీలా తనను కూడా సెక్యూరిటీ సిబ్బందే హతమారుస్తారని అనుమానంగా ఉందని ఆమ్ ఆద్మీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. పంజాబ్‌కు చెందిన ఒక న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన సొంత భద్రతా సిబ్బందితోనే బీజేపీ తనను హతమార్చే ప్రయత్నం చేస్తుందనే అనుమానం వ్యక్తం చేశారు. ఏదో ఒకరోజు బీజేపీ తనను చంపిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని మోతీనగర్ ప్రాంతంలో ఇటీవల రోడ్ షోలో పాల్గొన్నపుడు ఓ వ్యక్తి తనపై దాడి చేసిన విషయాన్ని కేజ్రీవాల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సదరు వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తగా బీజేపీ పేర్కొంటోందని ఆయన అన్నారు.