జాతీయ వార్తలు

మిమీ చక్రవర్తి గెలిచేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాదవ్‌పూర్ (పశ్చిమ బెంగాల్), మే 18: పశ్చిమ బెంగాల్‌లోని ప్రతిష్టాత్మక జాదవ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా వరుసగా మూడోసారి గెలవలేదు. తృణమూల్ కాంగ్రెస్ ఈసారి ఈ ధోరణిని నిలువరించగలదా? తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఒక పెద్ద వయసు కార్యకర్త మదిలో నుంచి వచ్చింది ఈ ప్రశ్న. అతని ఆలోచనలు వెంటనే 1984 నాటి పరిస్థితుల్లోకి వెళ్లిపోయాయి. ఆ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ పార్టీ యువ నాయకురాలు మమతా బెనర్జీ మార్క్సిస్టు పార్టీ దిగ్గజం, ప్రముఖ న్యాయవాది సోమ్‌నాథ్ చటర్జీని ఓడించారు. ఈసారి కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపిన తృణమూల్ కాంగ్రెస్ 1984లో సాధించినట్లుగా విజయం సాధిస్తుందా? గత రెండు ఎన్నికల్లో ఈ స్థానంలో గెలిచిన తృణమూల్ కాంగ్రెస్ వరుసగా మూడోసారి ఈ సీటును నిలబెట్టుకోవడానికి 30 ఏళ్ల సినీ నటి మిమీ చక్రవర్తిని రంగంలోకి దింపింది. మిమీ చక్రవర్తి జాదవ్‌పూర్‌లో మార్క్సిస్టు పార్టీకి చెందిన మరో పేరుమోసిన న్యాయవాది, కోల్‌కతా మాజీ మేయర్ వికాస్ రంజన్ భట్టాచార్య నుంచి గట్టి సవాలును ఎదుర్కొంటున్నారు. బీజేపీ ప్రజల్లో తనకు పెరిగిన ఆదరణ ఆధారంగా ఈ సీటును గెలుచుకోవాలని ఆశిస్తూ రద్దు కాబోతున్న లోక్‌సభలో టీఎంసీ సభ్యుడయిన అనుపమ్ హజ్రాను తన అభ్యర్థిగా నిలిపింది. ఎన్నికలకు ముందు హజ్రా టీఎంసీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరారు. జాదవ్‌పూర్‌లో గత ఎన్నికల్లో టీఎంసీ నుంచి హార్వర్డ్ ప్రొఫెసర్ సుగతా బోస్ గెలిచారు. సుగతా బోస్ తిరిగి పోటీ చేయడానికి హార్వర్డ్ విశ్వవిద్యాలయం అనుమించలేదని బెనర్జీ ఇదివరకే చెప్పారు. మిమీ చక్రవర్తి రోడ్ షోలకు పెద్ద సంఖ్యలో జనం హాజరవుతున్నారు. మిమీ చక్రవర్తికి ఉన్న ప్రజాదరణ ఎన్నికల్లో ప్రతిఫలిస్తుందని టీఎంసీ ధీమా వ్యక్తం చేస్తోంది. నేతాజీ సుభాశ్ చంద్రబోస్ కుటుంబానికి చెందిన సుగతా బోస్ గత ఎన్నికల్లో ఒక లక్షా 25వేలకు పైగా ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. మిమీ చక్రవర్తి అంతకన్నా ఎక్కువ మెజారిటీతో గెలుస్తారని టీఎంసీ గట్టిగా చెబుతోంది. 2009 ఎన్నికల్లో జాదవ్‌పూర్ నియోజకవర్గంలో టీఎంసీ అభ్యర్థి గాయకుడు, కవి కబీర్ సుమన్ గెలుపొందారు.
జాదవ్‌నగర్‌లో పోలింగ్ ఏడో దశలో ఆదివారం జరుగనుంది. సీపీఐ(ఎం) అభ్యర్థి భట్టాచార్య శారద, నారద కుంభకోణం కేసుల్లో పిటిషనర్ల తరపున ప్రధాన న్యాయవాది. ఈ రెండు కేసుల్లో సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు, కోల్‌కతా హైకోర్టు ఆదేశించాయి.