జాతీయ వార్తలు

ఎన్నికల కమిషనర్ ఆరోపణలపై విచారణ జరిపించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 18: ఎన్నికల కమిషనర్ అశోక్ లావసా చేసిన ఆరోపణలపై వెంటనే విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఎన్నికల కమిషన్ మోదీ సర్కారు చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆరోపించింది. ‘ఎలక్షన్ కమిషన్’ ఇపుడు ‘ఎలక్షన్ ఒమిషన్’గా మారిందని ఎద్దేవా చేసింది. ఎన్నికల కమిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలను, చేసిన ఆరోపణలను కూడా పట్టించుకోరా? అని శనివారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. ఈసీ సమావేశాల్లో పాల్గొన్నపుడు ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై అశోక్ లావసా పలు అభ్యంతరాలను వ్యక్తం చేశారని ఆయన అన్నారు. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ సమర్పించిన నివేదికల్లో అతని అభ్యంతరాలను, ఆరోపణలను ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన ధ్వజమెత్తారు. ప్రజాస్వామిక సంస్థలను మోదీ సర్కారు చిన్నాభిన్నం చేస్తోందని, వాటిపై పెత్తనం చెలాయిస్తోందని సుర్జేవాలా ఆరోపించారు. ప్రజాస్వామిక విలువలు నిలబెట్టాలంటే అశోక్ లావసా లేవనెత్తిన అంశాలపై విచారణ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ సీనియర్ నేత అహమ్మద్ పటేల్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన అవసరంపై లావసా రాసిన లేఖలో ఎన్నో అంశాలు ఉన్నాయని అన్నారు. అయితే, దేశంలో కేంద్ర ఎన్నికల కమిషన్ స్ధబ్ధుగా ఉండిపోయిందని విమర్శించారు. ఎలాంటి ఆరోపణలు వచ్చినా ఏమాత్రం స్పందించడం లేదని, అందుకే దీనిని ఎలక్షన్ కమిషన్ అనాలో ఎలక్షన్ ఒమిషన్ అనాలో తెలియడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. సమావేశంలో ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ వాటిని తప్పనిసరిగా రికార్డు చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కానీ ఎన్నికల కమిషన్ దానికి భిన్నంగా వ్యవహరిస్తూ కేంద్రానికి అనుకూలమైన అంశాలను నివేదికలో ఉంచుతూ మిగతావాటిని తోసిపుచ్చుతోందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా దేశంలో ప్రజాస్వామ్యం గొంతును నొక్కేస్తున్నారని ఆయన విమర్శించారు. సీబీఐని కూడా ఇదేవిధంగా తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారని ఆయన ధ్వజమెత్తారు.