జాతీయ వార్తలు

అకాలీదళ్‌కు ప్రతిష్టాత్మకం ఫిరోజ్‌పూర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిరోజ్‌పూర్, మే 18: పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం ఎన్నిక శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ)కు ప్రతిష్మాత్మకంగా మారింది. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఎస్‌ఏడీ అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎస్‌ఏడీ అభ్యర్థిగా గెలుపొందిన సిట్టింగ్ ఎంపీ షేర్ సింగ్ ఘుబయా ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఈ నియోజకవర్గంలో కులం ఎప్పుడూ కీలకంగానే పనిచేసింది. ఈ నియోజకవర్గంలో 200 కిలో మీటర్లకు పైగా పాకిస్తాన్‌తో అంతర్జాతీయ సరిహద్దు ఉంది. రాయ్ సిక్కుల ప్రాబల్యం ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంది. తరువాత స్థానాల్లో హిందువులు, కుమ్‌హారలు, జాట్ సిక్కులు, కంబోజ్‌లు ఉన్నారు. ఇక్కడి నుంచి ఎక్కువగా జాట్ సిక్కులు లేదా రాయ్ సిక్కులు అభ్యర్థులుగా ఉంటారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన బల్‌రాం జాఖడ్ మాత్రమే ఇందుకు మినహాయింపు. ఫిరోజ్‌పూర్ నియోజకవర్గం అకాలీదళ్‌కు కంచుకోటలా కనపడుతోంది. 1998 నుంచి వరుసగా అయిదుసార్లు ఎస్‌ఏడీ అభ్యర్థులే ఇక్కడ గెలుపొందారు. అకాలీదళ్ నేత జోరాసింగ్ మన్ 1998, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఇక్కడి నుంచి గెలుపొందారు. 2009లో ఎస్‌ఏడీ కులం కార్డును ప్రయోగించి, రాయ్ సిక్కు అయిన ఘుబయాను రంగంలోకి దింపింది. ఆయన ఫైర్‌బ్రాండ్ కాంగ్రెస్ నాయకుడు జగ్మీత్ సింగ్ బ్రార్‌ను ఓడించారు. ఘుబయా 2014లో మరోసారి ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఆయన మరో కాంగ్రెస్ నేత సునిల్ జాఖడ్‌ను ఓడించారు. అయితే, గత నెలలో ఘుబయా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఫిరోజ్‌పూర్ నుంచి అతనికే టికెట్ ఇచ్చింది. ఈ చర్య కాంగ్రెస్ పార్టీలో అనేక మందికి ఆగ్రహం తెప్పించింది. చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఆయనకు మద్దతు ఇవ్వడానికి నిరాకరించారు. ఘుబయా మాత్రం తన కులం ఓట్లపై ఎక్కువగా ఆధారపడ్డారు.