జాతీయ వార్తలు

రెండు గంటల్లో 53 శాతం పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిమ్లా, మే 19: హిమాచల్‌ప్రదేశ్‌లోని తాశీగాంగ్ గ్రామంలో గల ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో గల పోలింగ్ కేంద్రంలో ఆదివారం సుమారు తొలి రెండు గంటల్లోనే 53 శాతం పోలింగ్ నమోదయింది. 15,256 అడుగుల ఎత్తులో గల ఈ పోలింగ్ కేంద్రం పరిధిలో నమోదయిన ఓటర్ల సంఖ్య 49 మాత్రమే. గిరిజన జిల్లా లాహౌల్ అండ్ స్పిటిలో గల ఈ పోలింగ్ కేంద్రంలో ఉదయం ఏడు గంటలకు పోలింగ్ మొదలయింది. అప్పుడు అక్కడ ఉష్ణోగ్రత ఘనీభవన స్థానం కన్నా తక్కువగా ఉంది. గడ్డకట్టే చలిని తట్టుకోవడానికి ఓటర్లు తమ సంప్రదాయ దుస్తులు ధరించి వచ్చారని, ఉదయం తొమ్మిది గంటల కల్లా 53 పోలింగ్ నమోదయిందని రాష్ట్ర సహాయ ప్రధాన ఎన్నికల అధికారి హర్బన్స్ లాల్ ధీమన్ తెలిపారు. ఇక్కడికి సమీపంలోని హిక్కిం పోలింగ్ కేంద్రాన్ని ప్రపంచలోనే అత్యంత ఎత్తులో గల పోలింగ్ కేంద్రంగా గతంలో పరిగణించేవారని, కొన్ని సాంకేతిక కారణాల రీత్యా 2017 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాని స్థానంలో తాశీగాంగ్‌ను అత్యంత ఎత్తులో గల పోలింగ్ కేంద్రంగా నిర్ధారించారని ఆయన వివరించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మరో గిరిజన జిల్లా కిన్నౌర్‌లో గల కా పోలింగ్ కేంద్రంలో రాష్ట్రంలోనే అతి తక్కువ మంది ఓటర్లు ఉన్నారని ఆయన తెలిపారు. కేవలం 16 మంది ఓటర్ల కోసం కా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. తాశీగాంగ్, కా పోలింగ్ కేంద్రాలు రెండూ కూడా మండి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయని ఆయన వివరించారు.