జాతీయ వార్తలు

డిజిటల్ ప్రచారానికి రూ.53 కోట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 19: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గూగుల్, ఫేస్‌బుక్ వంటి డిజిటల్ వేదికలపై ప్రచారానికి వివిధ రాజకీయ పార్టీలు ఏకంగా 53 కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. ఇందులో బీజేపీ వాటానే ఎక్కువ. ఫేస్‌బుక్ ప్రకటించిన నివేదికను అనుసరించి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈనెల 15వరకు 1.26 లక్షల రాజకీయ ప్రకటనలు వచ్చాయి. ఇందుకోసం 26.5 కోట్ల రూపాయలను రాజకీయ పార్టీలు ఖర్చు చేశాయి. అదేవిధంగా గూగుల్, యూట్యూబ్ తదితర మాధ్యమాల్లో 27.36 కోట్ల రూపాయల విలువ చేసే 14,837 ప్రకటనలు దర్శనిమిచ్చాయి. బీజేపీ 4.37 కోట్ల రూపాయల విలువైన 2,500 పైచిలుకు ప్రకటనలు ఫేస్‌బుక్‌లో ఇచ్చింది. ‘మై ఫస్ట్ ఓట్ ఫర్ మోదీ’, ‘్భరత్ కే మాన్ కీ మాతా’, ‘నేషన్ విత్ నమో’ వంటి పేర్లతో ఫేస్‌బుక్‌లో ప్రత్యేక పేజీలతో బీజేపీ ముమ్మర ప్రచారం నిర్వహించింది. 4 కోట్ల రూపాయలు వ్యయం చేసి ఈ వేదికల ద్వారా ఇచ్చిన ప్రకటనలు సుమారు 20 కోట్ల మందికి చేరాయని ఫేస్‌బుక్ తెలిపింది. గూగుల్‌లో 17 కోట్ల రూపాయల విలువైన ప్రకటనలు కనిపించాయి. కాగా, కాంగ్రెస్ పార్టీ ఫేస్‌బుక్‌లో 3,686 ప్రకటనలు ఇచ్చి అందుకుగాను 1.46 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. గూగుల్ ప్లాట్‌ఫామ్ మీద 425 ప్రకటనలకు 2.71 కోట్ల రూపాయలు వెచ్చించింది. ఆమ్ ఆద్మీ పార్టీ 13.62 లక్షల రూపాయల వ్యయంతో 176 ప్రకటనలు ఫేస్‌బుక్ పేజీల ద్వారా ప్రజలకు చేరువైంది. ఈ పార్టీ డిజిటల్ ప్రచార భారాన్ని తీసుకున్న అబర్న్ డిజిటల్ సొల్యూషన్స్ సంస్థ ఫిబ్రవరి 19 నుంచి ఇప్పటివరకు 2.18 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం విశేషం. మొత్తమీద ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో డిజిటల్ ప్రచారం జోరుగా సాగింది.