జాతీయ వార్తలు

కాంగ్రెస్ నాయకుడి ఇంటి సమీపంలో పేలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 19: కాంగ్రెస్ ఎమ్మెల్యే ముణిరత్న నివాసం ఉంటున్న వ్యాలికావల్‌లో ఆదివారం జరిగిన బాంబు పేలుడు సంఘటనలో ఒకరు మృతి చెందారు. బెంగళూరు పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..ఎమ్మెల్యే ఇంటికి అతి సమీపంలో పేలుడు జరిగిన ప్రాంతం నుంచి ఒక ప్లాస్టిక్ ప్యాకెట్‌ను గుర్తించారు. ఈ సంఘటనలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన పూర్వాపరాలు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.