జాతీయ వార్తలు

ఇన్ని విడతలెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, మే 19: సుదీర్ఘకాలం, ఏడు విడతలుగా, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ నిర్వహించడంపై బీహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధ్యక్షుడు నితీష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్ని విడతలు పోలింగ్ ఎందుకని ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్‌ను నిలదీశారు. రెండు, మూడు విడతల్లో పోలింగ్ పూర్తయ్యుంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. తీవ్రమైన ఎండలు మండిపోతున్న తరుణంలో పోలింగ్ కేంద్రాలకు ఓటు వేయడానికి ఓటర్లు రావడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఫిబ్రవరి, మార్చి లేదా అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఎన్నికల ప్రక్రియ ఉంటే వాతావరణం ఎంతో అనుకూలంగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. తొలి విడతకు, చివరి విడతకు మధ్య చాలా ఎక్కువ రోజుల తేడా ఉండడంతో ఓటింగ్ తీరుతెన్నుల్లో కూడా మార్పులు వచ్చే ప్రమాదం ఉందని నితీష్ అన్నారు. ఎన్నికలకు ఎంతో అనువైన కాలాన్ని విడిచిపెట్టి, విపరీతమైన ఎండల్లో పోలింగ్ నిర్వహించడంలో అర్థం లేదని ఆయన విమర్శించారు. కేంద్రంలో మళ్లీ నరేంద్ర మోదీ సర్కారు ఏర్పాటవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల కూటమిని ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోరని ఆయన అన్నారు.

చిత్రం...బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్