జాతీయ వార్తలు

మహాత్ముడు సూపర్ స్టార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మే 19: జాతిపిత మహాత్మాగాంధీని సూపర్‌స్టార్‌గా మక్కల్ నీది మయాం (ఎంఎన్‌ఎం) పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ నటుడు కమల్‌హాసన్ అభివర్ణించారు. గాంధీని హత్యచేసిన నాథూరామ్ గాడ్సేని భారత తొలి హిందూ ఉగ్రవాదిగా పేర్కొన్న కమల్‌హాసన్‌పై సర్వత్రా విమర్శలు పెల్లుబుకుతున్న విషయం తెలిసిందే. ఆర్.పార్తీబన్ దర్శకత్వంలో ‘ఒత్త సెరుప్పు’ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న కమల్‌హాసన్ మాట్లాడుతూ గాంధీజీని మించిన సూపర్‌స్టార్ ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. ఒకసారి గాంధీ రైలులో వెళ్తున్నపుడు ఆయన ఒక కాలి చెప్పు పొరపాటున జారిపోయిందని, వెంటనే తన రెండో కాలి చెప్పును కూడా ఆయన బయటకు విసిరేశారని కమల్‌హాసన్ అన్నారు. ఒక చెప్పు తనకు గానీ, మరొకరికిగానీ ఉపయోగపడదని గాంధీ అప్పట్లో వ్యాఖ్యానించినట్టు కమల్ చెప్పారు. గాంధీ చెప్పును సాకేత్‌రామ్ అనే వ్యక్తి భద్రపరుచుకున్నాడని ఆయన అన్నారు. ఈ సినిమాలో సాకేత్‌రామ్ పాత్రను తాను పోషిస్తున్నట్టు కమల్‌హాసన్ తెలిపారు. గాడ్సేపై తాను చేసిన ఇదివరలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని కమల్‌హాసన్ స్పష్టం చేశారు. ఒక విలన్‌ను హీరోగా అంగీకరించబోనని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరు ఏమనుకున్నా తాను మాత్రం కొన్ని విలువలకు కట్టుబడి ఉన్నానని అన్నారు.

చిత్రం...కమల్‌హాసన్