జాతీయ వార్తలు

మోదీకి అంత కవరేజా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 19: ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల నియమావళిని ఘోరంగా ఉల్లంఘించారని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. శనివారం మోదీ కేదార్‌నాథ్ పర్యటనపై మీడియా విస్తృత ప్రచారం చేసిందని టీఎంసీ ఆరోపించింది. ఈమేరకు ఆదివారం ఎన్నికల సంఘానికి పార్టీ లిఖితపూర్వంగా ఫిర్యాదు చేసింది. పుణ్యక్షేత్రం సందర్శన పేరుతో కేదార్‌నాథ్ వెళ్లిన ప్రధాని ‘కోడ్’ ఉల్లంఘనకు పాల్పడ్డారని తృణమూల్ విమర్శించింది. మీడియాతో మాట్లాడడం, కేదారినాథ్ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ ప్రకటించడం అనైతికం అంటూ ఈసీకి తెలిపింది. ‘మోదీ తీరు అనైతికం, నిబంధనల ఉల్లంఘనే’అని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి డెరెక్ ఓబ్రియెన్ ధ్వజమెత్తారు. ‘2019 ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 17 సాయంత్రం 6 గంటలతో ప్రచారం పరిసమాప్తం అయింది. అయితే ప్రధాని నరేంద్రమోదీ కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లడం ఆశ్చర్యకరం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో దానికి విస్తృత ప్రచారం కల్పించడం దారుణం. రెండు రోజులపాటు అన్ని జాతీయ, స్థానిక మీడియాలో మోదీ కేదార్‌నాథ్ పర్యటనకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం కోడ్ ఉల్లంఘనే’అని ఆయన నిప్పులు చెరిగారు. ఆదివారం ఉదయం ఆలయ సందర్శన చేసుకున్న మోదీ అక్కడే మీడియాతో మాట్లాడారని పేర్కొన్న తృణమూల్ కాంగ్రెస్ తన పర్యటనకు అనుమతి ఇచ్చిన ఈసీకి కృతజ్ఞతలంటూ చెప్పడం దేనికి సంకేతాలని నిలదీశారు. ‘కొండపై ప్రతి నిమిషం ఏం జరుగుందీ, మోదీ పర్యటన ఎలా సాగుతుందీ మీడియాలో చూపించారు. ఆఖరి విడత పోలింగ్‌లో ఓటర్లను ప్రత్యక్షం/పరోక్షంగా ప్రభావితం చేసింది. దీనిపై ఈసీ చర్యలు చేపట్టాలి’అని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని కేదార్‌నాథ్ పర్యటనలో ‘మోదీ మోదీ’ అంటూ నినాదాలు మిన్నంటాయని టీఎంసీ నేత విమర్శించారు. కేదార్‌నాథ్‌లో మోదీ పర్యటన పక్కా ప్రణాళిక కింద సాగిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో లబ్ధిపొందాలన్న దృష్టితోనే మోదీ దీన్ని చేపట్టినా ఈసీ వౌనం దాల్చడం దురదృష్టకరమని ఆయన ధ్వజమెత్తారు. ‘ఎన్నికల సంఘం కళ్లుండి చూడలేక, చెవులుండి వినబడక‘అన్నట్టు వ్యవహరించిందని టీఎంపీ దుయ్యబట్టింది. ‘నిబంధనలను ఉల్లంఘనలపై దృష్టిపెట్టండి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోండి’అని ఈసీకి ఘాటైన లేఖ రాసింది. పోలింగ్ రోజు ప్రధాని మోదీ పర్యటన జరపడం అనైతికం, అసంబద్ధం అని డెరెక్ వ్యాఖ్యానించారు.