జాతీయ వార్తలు

యోగి కేబినెట్ నుంచి మంత్రి రాజ్‌భర్‌కు ఉద్వాసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మే 20: లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన మర్నాడే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన కేబినెట్‌లోని బీసీ సంక్షేమ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్‌కి ఉద్వాసన చెప్పారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ మిత్రపక్షమైన ఓం ప్రకాశ్ ఎస్‌బీఎస్‌పీ అధినేత. ఓం ప్రకాశ్‌ను తప్పిస్తూ యోగి తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ రామ్‌నాయక్ వెంటనే ఆమోదం తెలిపారు. తక్షణం ఆయనను మంత్రి పదవి నుంచి తప్పిస్తూ ఆదేశాలిచ్చారు. రాజ్‌భర్ వెనుకబడిన తరగతుల సంక్షేమం, దివ్యాంగుల సాధికారిత మంత్రిగా పనిచేశారు. అలాగే ఓంప్రకాశ్‌కు చెందిన సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్‌బీఎస్‌పీ) సభ్యులకు కల్పించిన సహాయ మంత్రి హోదాను తొలగిస్తూ ముఖ్యమంత్రి చేసిన సిఫార్సులకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. మంత్రి పదవిని కోల్పోయిన తరువాత రాజ్‌భర్ మీడియాతోమాట్లాడుతూ యోగి ఆదిత్యనాథ్ నిర్ణయాన్ని స్వాగతించారు. ‘కేబినెట్ నుంచి తప్పించాలని సీఎం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. ఇప్పటికే ఆలస్యమైంది. ఈ పని ఇంతకు ముందే చేయాల్సింది’అని రాజ్‌భర్ అన్నారు. ‘ఇరవై రోజుల ముందే మంత్రి వర్గం నుంచి తప్పించి ఉంటే బావుండేది’అని ఆయన పేర్కొన్నారు. తనను ముంత్రి వర్గం నుంచి తప్పించినా పేదరికంపై తాను చేపట్టిన ఉద్యమం కొనసాగుతుందని రాజ్‌భర్ ప్రకటించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్‌బీఎస్‌పీ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచింది. ఓం ప్రకాశ్ రాజభర్ బీసీ సంక్షేమ మంత్రిగా యోగి కేబినెట్‌లో చేరారు. యూపీ బీసీ కమిషన్ సభ్యులు రంగారాం రాజ్‌భర్, విరేంద్ర రాజ్‌భర్, యూపీ పశుధన్ వికాస్ పరిషత్ సభ్యులు సుధామ రాజ్‌భర్, సూక్ష్మ, మధ్య పారిశ్రామిక విభాగం చైర్మన్ అరవింద్ రాజ్‌భర్, యూపీ విత్తనాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కం డైరెక్టర్ అజిత్ ప్రతాప్ సిగ్ నేషలన్ ఇంటిగ్రేటెడ్ కౌన్సిల్ సభ్యులు సునీల్ అర్కవన్షి, రాధికా పటేల్‌కు ఉద్వాసనం పలికారు. వారందరూ సహాయ మంత్రులుగా కేబినెట్ ర్యాంక్‌లో ఉండేవారు.