జాతీయ వార్తలు

సర్వేలన్నీ డొల్ల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 20: ఎగ్జిట్‌పోల్ సర్వేల్లో కాంగ్రెస్ పార్టీకి చేదు ఫలితాలు వస్తాయని వెల్లడించినా కార్యకర్తల్లో మాత్రం మనోధైర్యం సడలిపోలేదు. 23న ఓట్ల లెక్కింపులో ఫలితాలు తమకే అనుకూలంగా వస్తాయన్న ధీమాతో వారంతా ఉన్నారు. ఎగ్జిట్‌పోల్ సర్వేలతో సంబంధం లేకుండా ఫలితాలుంటాయని కాంగ్రెస్ శ్రేణులు విశ్వాసంతో ఉన్నాయి. ఆదివారం సాయంత్రం వెల్లడైన సర్వేలన్నీ నరేంద్ర మోదీ మరోసారి ప్రధాన మంత్రి అవుతారని తేల్చాయి. బీజేపీ సారధ్యంలోని ఎన్‌డీఏకు 300కు పైగా సీట్లు వస్తాయని వెల్లడించాయి. ఎగ్జిట్‌పోల్స్ సర్వేలను కాంగ్రెస్ నేతలు పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. దేశ రాజధాని ఢిల్లీలోని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం వద్ద సోమవారం ఉదయం అంత హడావుడి కనిపించలేదు. అయితే 23నాటి ఫలితాలు మరోలా ఉంటాయని కార్యకర్తలు వ్యాఖ్యానించారు. ఈవీఎంలను మార్చేసి ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని ఎగ్జిట్‌పోల్ సర్వేలు ఇచ్చుకున్నారని బీజేపీపై ధ్వజమెత్తారు. ‘ఓ పథకం ప్రకారం అంతటా మోదీ గాలి ఉందనేలా సర్వేలు చేయించుకున్నారు’అని వారు ఆరోపిస్తున్నారు. సర్వేలన్నీ నిజం కావని, తాము ఆశించి ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ నేత జగదీష్ శర్మ అన్నారు. ఒక్క బీజేపీ తప్ప ఎగ్జిట్‌పోల్ సర్వేలను ఎవరూ నమ్మరని, వాస్త ఫలితాలు మరోలా ఉంటాయి..జనం చూస్తారు అని ఆయన స్పష్టం చేశారు. ఫలితాలు వెలువడ్డా మహాకూటమిని దెబ్బతీయడానికి బీజేపీ ఎగ్జిట్‌పోల్ సర్వేను వ్యూహం ప్రకారం చేసిందని కాంగ్రెస్ విచార్ విభాగ్ ప్రధాన కార్యదర్శి నీతా మిశ్రా విమర్శించారు. ‘ఎగ్జిట్‌పోల్ సర్వేలను చూసి మేం భయపడిపోవడం లేదు. అలాగే ఎలాంటి నిరుత్సాం లేదు. బీజేపీకి జనంలో బోలేడు వ్యతిరేకత ఉంది. అలాంటి వారు మిగతా పార్టీకి ఓటు వేశారు. ఎగ్జిట్‌పోల్ సర్వేను ఎవరూ నమ్మడం లేదు. మేమూ విశ్వసించడం లేదు’అని యూపీకి చెందిన కాంగ్రెస్ నేత సురేష్ సింగ్ అన్నారు. అసలు ఎగ్జిట్‌పోల్స్‌కు ఉన్న విశ్వసనీయత ఏమిటని ఆయన ప్రశ్నించారు. యూపీలో ఎన్‌డీఏకు 22 అని కొన్ని సంస్థలు, 52 అని కొన్ని సంస్థలు పొంతనలేని జోస్యాలు చెబుతున్నాయని సింగ్ అన్నారు. ఏబీపీ-నీల్స్‌న్ బీజేపీ బలం 71 నుంచి 22కి పడిపోతుందని చెప్పింది. అలాగే న్యూ 18-ఐప్సో, న్యూ 24-చాణక్య బీజేపీకి 60 సీట్లు గ్యారెంటీ అని చెబుతున్నాయి, ఇందులో దేన్ని నమ్మాలి?అని సింగ్ ప్రశ్నించారు. బీజేపీని ఆకాశానికి ఎత్తేయడం, ప్రజల్లో ఒక రకమైన అనిశ్చితి కల్పించడం ‘పెయిడ్ మీడియా’పనేనని రిషీ వల్లభ్ ఆరోపించారు. 1997 నుంచి కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న వల్లభ్ ‘నిజాలేమిటో 23న గురువారం తేలుతుంది.