జాతీయ వార్తలు

అది తలమానిక విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉధంపూర్, మే 20: పుల్వామా ఉగ్రదాడి తరువాత పాక్‌లోని బాలాకోట్‌పై వైమానిక దాడి ఘన విజయంగా ఉత్తర మండల ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రణ్‌బీర్ సింగ్ స్పష్టం చేశారు. అలాగే 2016 సెప్టెంబర్‌లో భారత తొలిసారి లక్షిత దాడులు చేసిందని ఆయన ధృవీకరించారు. ఆర్‌టీఐకు ఆయన సమాధానం ఇస్తూ విషయాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్(డీజీఎంఓ)కు వెల్లడించారు.
‘పాకిస్తాన్‌లోని బాలాకోట్ ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దాడులు జరిపింది’అని సింగ్ మీడియాకు తెలిపారు. శతృదేశం భూభాగంలోని ఉగ్రమూకల శిబిరాలపై వైమాదిక దాడులు చేయడం సైన్యం ఘన కీర్తిగా ఆయన అభివర్ణించారు. నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ)ను ఆనుకునే పాకిస్తాన్ తన కార్యకలాపాలు నిర్వహిస్తోందన్న రణ్‌బీర్ సింగ్ ‘లక్షిత దాడి ద్వారా సరైన గుణపాఠం చెప్పాం’అని స్పష్టం చేశారు. ‘పొరుగుదేశం నుంచి వచ్చే ఎలాంటి సవాళ్లనైనా దీటుగా ఎదర్కొనే శక్తి, సామర్థ్యాలు మన సైన్యానికి ఉన్నాయి. భారత సాయుధ దళాలు నిత్యం అప్రమత్తతో పనిచేస్తున్నాయి’అని ఆయన వెల్లడించారు. 2016 సెప్టెంబర్‌కు ముందు లక్షిత దాడులు జరిగాయా అన్న ప్రశ్నకు లెఫ్టినెంట్ జనరల్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. కొద్ది రోజుల క్రితం డీజీఎంఓ ‘తొలి లక్షిత దాడి 2016 సెప్టెంబర్‌లోనే జరిగింది’అని ఆర్‌టీఐకి తెలిపింది. లక్షిత దాడులపై రాజకీయ పార్టీలు చేస్తున్న వ్యాఖ్యల జోలికి తాము వెళ్లబోమన్న లెఫ్టినెంట్ జనరల్ ‘బాలాకోట్ దాడిపై నేను చేసిన ప్రకటన వాస్తవం’అని పేర్కొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు యుపీఏ హయాంలోనూ లక్షిత దాడులు జరిగినట్టు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘మా హయాంలో అనేక లక్షిత దాడులు జరిగాయి. శతృవును నియంత్రించడంలో భాగంగా సైన్యం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది’అని ఓ ఇంటర్‌వ్యూలో మన్మోహన్ చెప్పారు. సైనిక కార్యక్రమాలను ఓట్ల కోసం ప్రచారంలో వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మన్మోహన్‌సింగ్ హయాంలో కూడా ఆరు లక్షిత దాడులు జరిగినట్టు కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా గతవారం మీడియాకు తెలిపారు. ఆర్మీ మాజీ చీఫ్, కేంద్ర మంత్రి వీకే సింగ్ కాంగ్రెస్ ప్రకటనలు తోసిపుచ్చారు. లక్షిత దాడులపై కాంగ్రెస్ అబద్ధాలుడుతోందని ఆయన విరుచుకుపడ్డారు.