జాతీయ వార్తలు

వీవీ ప్యాట్ల స్లిప్పులు, ఓట్ల మధ్య తేడా వస్తే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 20: వీవీ ప్యాట్ల స్లిప్పులకు, ఇవీఎంలోని ఓట్ల సంఖ్య మధ్య తేడా వస్తే ఆ నియోజకవర్గంలోని అన్ని ఓట్లను, వీవీ ప్యాట్ల స్లిప్పులనూ లెక్కించాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కేంద్ర ఎన్నికల కమిషన్‌ను (సీఇసీ) డిమాండ్ చేశారు. ఓట్ల లెక్కింపు విషయంలో పలు సూచనలు, అభ్యంతరాలతో 21 ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ చేసిన సుప్రీంకోర్టు ప్రతి నియోజకవర్గంలో శాంపిల్స్‌గా ఏవైనా ఐదు ఇవీఎంలను, వీవీ ప్యాట్లను లెక్కించాలని ఇటీవల సీఇసీని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ప్రతి నియోజకవర్గంలో 50 శాతం ఓట్లను, 50 శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలన్న ప్రతిపక్షాలు దాఖలు చేసిన రివ్యూ పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. కాగా ఎంపిక చేసిన ఇవీఎం ఓట్లకు, వీవీ ప్యాట్ల సంఖ్యకు తేడా వస్తే ఆ నియోజకవర్గంలోని అన్ని ఇవీఎంల ఓట్లను, వీవీ ప్యాట్ల స్లిప్పులనూ లెక్కించాలని సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. లోక్‌సభకు ఏడు విడతలుగా జరిగిన పోలింగ్ ఆదివారంతో ముగిసింది. ఈ నెల 23న (గురువారం) ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నది.