జాతీయ వార్తలు

మళ్లీ బలపరీక్షకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, మే 20: అసెంబ్లీలో తన మెజారిటీ నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సోమవారం నాడిక్కడ స్పష్టం చేశారు. కమల్‌నాథ్ ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర గవర్నర్‌కు బీజేపీ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో అందుకు ఆయన సన్నద్ధత వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కొవడానికి తనకు ఎలాంటి అభ్యంతరమూ లేదని వెల్లడించిన కమల్‌నాథ్ ‘ఇప్పటికే నాలుగు సార్లు నా ప్రభుత్వ మెజారిటీని అసెంబ్లీలో నిరూపించుకున్నాను, మళ్లీ అందుకు సిద్ధంగా ఉన్నాను’ అని తెలిపారు. గతంలో తమ పార్టీ పాలనలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే బీజేపీ ఈ రకమైన డిమాండ్ చేస్తోందని కమల్‌నాథ్ విరుచుకుపడ్డారు. గతంలో కూడా బలపరీక్షను డిమాండ్ చేసిన బీజేపీ పరాజితమైందని ఆయన పేర్కొన్నారు. సభలో ఓట్లను లెక్కించాలని బీజేపీ డిమాండ్ చేసినప్పటికీ అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను తమ పార్టీ నుంచి కాంగ్రెస్ ఎంపిక చేసుకోగలిగిందని కమల్‌నాథ్ తెలిపారు. అలాగే అనుబంధ బడ్జెట్‌ను, సాధారణ బడ్జెట్‌ను కూడా తమ ప్రభుత్వం ఆమోదింపజేసుకోగలిగిందని గుర్తు చేశారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 230 సీట్లలో కాంగ్రెస్ 114 స్థానాలను గెలుచుకుంది. అసెంబ్లీలో స్వల్ప మెజారిటీకి కావాల్సిన మెజారిటీ 116. ఇద్దరు ఎమ్మెల్యేలు కలిగిన బీఎస్పీ, అలాగే ఒక స్థానం కలిగిన సమాజ్‌వాది పార్టీ కాంగ్రెస్‌కు మద్దతునిచ్చాయి. రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ బలం 109. కమల్‌నాథ్ ప్రభుత్వం బలనిరూపణకు వీలుగా అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని గవర్నర్ ఆనందిబెన్ పటేల్‌ను కోరిన బీజేపీ రుణ మాఫీ తదితర అంశాలపై అసెంబ్లీలో చర్చ జరగాలని డిమాండ్ చేసింది..