జాతీయ వార్తలు

ఎగ్జిట్‌కు అనుగుణంగా అంతిమ ఫలితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పలు సర్వేల్లో వెల్లడైనట్లుగా కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి రాగలదన్న ధీమాను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ సర్వేలకు అనుగుణంగానే అంతిమ ఫలితాలు ఉండగలవన్న నమ్మకం తనకుందని అన్నారు. అయితే ఎన్డీఏకు 300కు పైగా సీట్లు వస్తాయని ఒక సర్వే తెలిపిందన్న పేర్కొన్న జైట్లీ అయితే ఈ సర్వేల్లో ఉన్న తేడాల దృష్ట్యా వాస్తవికతను అవి ఎంతమేరకు ప్రతిబింబించగలవన్న సంక్లిష్టత నెలకొందని అన్నారు. మొత్తం మీద అనేక సర్వేలు కచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్న విషయాన్ని విస్పష్టంగా తెలియజేశాయని వెల్లడించిన ఆయన ‘వీటి ఉమ్మడి సందేశం వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం అన్నదే’ అని ఉద్ఘాటించారు. ఎగ్జిట్ పోల్స్ సందేశం అన్న పేరిట చేసిన పోస్ట్‌లో తన ఆలోచనలను జైట్లీ వెల్లడించారు. సర్వేల ప్రకారమే ఎన్నికల ఫలితాలు వెల్లడైతే ఈవీఎంల సహేతుకతపై ప్రతి పక్షాలు చేసిన వాదనంతా నీరుగారి పోయినట్టే అవుతుందని తెలిపారు. 2014 ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఎగ్జిట్ పోల్ అంచనాలను పరిశీలిస్తే భారత ప్రజాస్వామ్యంలో మరింత పరిణతి నెలకొందన్న విషయం స్పష్టమవుతుందన్నారు. తాము ఎవరికి ఓటు వేస్తున్నామన్న విషయాన్ని నిర్ణయించుకోవడానికి ముందే భారతీయ ఓటర్లు జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారన్న విషయాన్ని ఈ అంచనాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. అందరూ ఇదే ఆలోచనతో ఓటు హక్కు వినియోగించుకుంటే అదో ప్రభంజనమే అవుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబం ఓ గుదిబండగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. గాంధీ కుటుం బం లేనిదే కాంగ్రెస్ పార్టీకి జనం వచ్చే పరిస్థితి లేదని, ఆ పార్టీనే నమ్ముకుని వుంటే ఎవరూ ఓటేసే అవకాశమే ఉండదని అన్నారు. 2014లో నూ, 2019 ఎన్నికల్లో కూడా మోదీకి వ్యతిరేకంగా చేసిన వ్యక్తిగత విమర్శలేవీ ఫలించలేదన్నారు. నేతలను నాయకత్వ పటిమను బట్టే ఎన్నుకుంటారు తప్ప, కులం లేదా కుటుంబ పేర్లను బట్టి కాదని జైట్లీ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ కులానికి అతీతంగా పనిచేసి సమర్ధతకే ప్రాధాన్యత ఇచ్చారని, అందుకే ప్రతి ఒక్కరికీ చేరువ కాగలిగారని జైట్లీ అన్నారు. అలాగే భిన్న ఆలోచనలు కలిగిన పార్టీల కూటములను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని పేర్కొన్న ఆయన పసలేని వాదనలు పనిచేయవన్న విషయాన్ని ప్రజలు విశ్వసించరని అన్నారు.
అవి అంచనాలు మాత్రమే: గడ్కరీ
నాగ్‌పూర్: ఎగ్జిట్ పోల్స్‌లో వచ్చిన ఫలితాలను తుది నిర్ణయంగా పరిగణించడానికి వీలులేదని, కేంద్రంలో బీజేపీయే మళ్లీ అధికారంలోకి వస్తుందన్న సంకేతాన్ని మాత్రమే అవి అందించాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనే బయోపిక్ పోస్టర్ విడుదల సందర్భంగా సోమవారం ఇక్కడ మాట్లాడిన గఢ్కరి ఎగ్జిట్ పోల్స్‌లో వచ్చిన అంచనాలే దాదాపుగా వాస్తవ ఫలితాల్లోనూ కనిపిస్తాయని తెలిపారు. కొత్తగా కేంద్రంలో మోదీ సారథ్యంలోనే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పడం ద్వారా ప్రధాని పదవికి పోటీలో తాను లేననే విషయాన్ని మరోసారి గడ్కరీ స్పష్టం చేశారు.