జాతీయ వార్తలు

ఈవీఎంలకు ఢోకాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 21: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎం)పై వివిధ ప్రతిపక్షాలు అనేక అనుమానాలు లేవనెత్తుతున్న నేపథ్యంలో ఢిల్లీ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ రణ్‌బీర్ సింగ్ తనదైన రీతిలో స్పందించారు. ఈవీఎంలతో ఎలాంటి అవకతవకలకు తావులేదని, పారదర్శకతతోపాటు పాలనా సంబంధ వ్యవహారాలపై అనుమానాలను నివృత్తి చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవిధంగా చెప్పాలంటే ఈవీఎంలను ‘బలీయమైన డిజైన్’తో నిర్మితమైందని, వీటితో ఎలాంటి ట్యాంపరింగ్‌లకు ఆస్కారం లేదని పేర్కొన్నారు. ‘ఆ మెషీన్‌తో ట్యాంపరింగ్‌కు ఎలాంటి ఛానే్స లేదు. అదేవిధంగా మోసగించడానికిగానీ లేదా హ్యాకింగ్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే ఈ మెషీన్లకు బయటి ప్రపంచంతో ఎలాంటి సంబం ధ బాంధవ్యాలు ఉండవు. వీటికి ఇంటర్నెట్ సదుపాయం ఉండదు. వైఫై లేదా బ్లూటూత్ వంటివాటితో అనుసంధానం అసలే ఉండదు. మెషీన్‌ను ఏరకంగానూ తమకు అనుకూలంగా మార్చే అవకాశం లేదు. ఇందులో నిక్షిప్తం చేసిన ప్రోగ్రామ్‌తో కూడిన చిప్ ఉండడమే ఇందుకు కారణం’ అని ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రణ్‌బీర్ సింగ్ పీటీఐ ప్రతినిధితో మాట్లాడుతూ అన్నారు. ఇదిలావుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సోమవారం ఎన్నికల కమిషన్‌ను కలుసుకుని దక్షిణ ఢిల్లీలో ఈనెల 23న జరిగే కౌంటింగ్ కంటే ముందుగానే ప్రత్యర్థి పార్టీలు ఈవీఎంలను ఏమార్చేందుకు కుట్ర పన్నుతున్నారని, కనుక కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఆప్ పార్టీ దక్షిణ ఢిల్లీ అభ్యర్థి, పార్టీ అధికార ప్రతినిధి రాఘవ చంద మాట్లాడుతూ గతంలో కొన్ని పార్టీలవారు పోలింగ్ బాక్స్‌లను భద్రపరచిన కేంద్రాల్లో దౌర్జన్యాలకు దిగడం, ఆయా కేంద్రాలను బలవంతంగా తెరవడం, ఓటింగ్ మెషీన్లను ఒకచోట నుంచి మరొకచోటుకు తరలించడం, మభ్యపెట్టడం వంటి అంశాలు జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీనిపై ఢిల్లీ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ రణ్‌బీర్ సింగ్ మాట్లాడుతూ ఈవీఎంలు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) వంటి పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో గట్టి బందోబస్తు మధ్య నిబంధనలకు అనుగుణంగా తగిన ప్రొగ్రామ్‌తో కూడిన చిప్‌ల అనుసంధానంతో పగడ్బందీగా రూపొందించారని అన్నారు. ఒకవేళ ఎవరైనా ఆయా మెషీన్లలోని ప్రోగ్రామ్‌ను మార్చాలని ప్రయత్నిస్తే మెషీన్ వైబ్రేషన్‌కు గురికావడంతోపాటు వాటిలోని స్విచ్‌లు దెబ్బతినడంతోపాటు చివరకు మెషీన్ పూర్తిగా పనిచేసే ఆస్కారం ఏమాత్రం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆయా రాష్ట్రాలకు కేటాయించిన ఈవీఎంలను సైతం పటిష్ట భద్రత మధ్యే తరలిస్తారని ఆయన తెలిపారు.