జాతీయ వార్తలు

మళ్లీ ఇరకాటంలో ప్రజ్ఞ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, మే 21: వివాదస్పద వ్యాఖ్యలతో బీజేపీ అధినాయకత్వానికే తలనొప్పిగా మారిన ఆ పార్టీ భోపాల్ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌పై 12 సంవత్సరాల క్రితం నాటి హత్య కేసును తిరగదోడాలని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. భోపాల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ గెలుపొందనున్నట్లు ఎగ్జిట్ పోల్ సర్వేల్లో వెల్లడైంది. ఇలాఉండగా 12 సంవత్సరాల క్రితం ఆర్‌ఎస్‌ఎస్ మాజీ ప్రచారక్ సునీల్ జోషి హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ప్రజ్ఞా విచారణలో నిర్దోషిగా బయటపడ్డారు. అయితే ఈ కేసును పునఃవిచారణ జరిపించే విషయంలో మధ్య ప్రదేశ్‌లోని కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం యోచన చేస్తున్నది. 2007 సంవత్సరం డిసెంబర్ 29వ తేదీన జోషి హత్యకు గురయ్యారని మధ్య ప్రదేశ్ రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి పీసీ జోషి తెలిపారు. ఈ కేసులో ప్రజ్ఞా సింగ్‌తో పాటు మరో ఏడుగురిపై నిందితులుగా పోలీసు కేసు నమోదైందని ఆయన చెప్పారు. కాగా 2017 సంవత్సరంలో కోర్టు సరైన సాక్షాధారాలు లేవని ప్రజ్ఞాను నిర్దోషిగా విడుదల చేసిందన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం ఈ కేసును పునఃవిచారణ కోసం అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ విషయంలో న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నామన్నారు. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత హైకోర్టులో అప్పీలుకు వెళతమన్నారు. భోపాల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ ప్రజ్ఞాను బరిలోకి దించింది. బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నదని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ప్రజ్ఞాను బీజేపీ బరిలోకి దించినందుకే మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఆమెపై లోగడ ఉన్న కేసును తిరగదోడాలని భావిస్తున్నది.