జాతీయ వార్తలు

అనుమానాలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 21: స్ట్రాంగ్ రూమ్‌లలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం), వీవీ ప్యాట్ స్లిప్పులూ భద్రంగా ఉన్నాయని ప్రధాన ఎన్నికల కమిషన్ (సీఇసీ) స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు, అపోహలు అవసరం లేదని తెలిపింది. ఈవీఎంలను తారుమారు చేస్తున్నారంటూ వివిధ పార్టీల నేతలు చేస్తున్న ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో సీఇసీ వివరణ ఇచ్చింది. ఆ ఆరోపణలు, ఫిర్యాదుల్లో ఏమాత్రం వాస్తవం లేదని, అవన్నీ కల్పితాలని తోసిపుచ్చింది. వివిధ టీవీలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న వాటినీ ఖండించింది. పోలింగ్ ముగిసిన వెంటనే అందరి సమక్షంలో ఈవీఎంలను సీల్డ్ చేయడం, వాటిని స్ట్రాంగ్ రూంలకు తరలించి భద్రపరచడం, అభ్యర్థుల సమక్షంలోనే స్ట్రాంగ్ రూంలకు రెండు తాళాలు వేయడం, ఈ ప్రక్రియనంతా వీడియో ద్వారా రికార్డు చేయడం జరిగిందని తెలిపింది. 24 గంటలూ భారీగా కేంద్ర పోలీసు బలగాల పహారా ఉందని, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కూడా ఉందని వివరించింది. పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫు ఏజెంట్లూ స్ట్రాంగ్ రూంల వద్ద ఉండేందుకూ అవకాశం కల్పించినట్లు తెలిపింది. ఇక 23న ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందు స్ట్రాంగ్ రూమ్‌లను అభ్యర్థుల, వారి ఏజెంట్ల సమక్షంలో అధికారులు తెరుస్తారని ఈసీ పేర్కొంది. ఈ ప్రక్రియను పూర్తిచేసేప్పుడు కూడా వీడియో తీయడం జరుగుతుందని, అభ్యర్థులు, ఏజెంట్లు సంతృప్తి చెందిన తర్వాతే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఈసీ వివరించింది. కాబట్టి ఎవరికీ అనుమానాలు అవసరం లేదని, ఈ విషయంలో అధికారులు జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా తేడా వస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది.