జాతీయ వార్తలు

నింగిలోకి నిఘానేత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, మే 21: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో దూరపరిశీలనా (రిమోట్ సెన్సింగ్ శాటిలైట్) ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగకేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం ఉదయం 5:30గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ 46 రాకెట్ ప్రయోగం చేపట్టనున్నారు. ప్రయోగానికి ముందు చేపట్టే కౌంట్‌డౌన్ మంగళవారం తెల్లవారుజామున 4:30గంటలకు ప్రారంభించారు. ఈ రాకెట్ ద్వారా 615కిలోల బరువుగల రీశాట్-2బీ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. రాకెట్ విజయం కోసం ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ శాస్తవ్రేత్తలతో కలసి చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన నేరుగా షార్‌కు చేరుకుని షార్ డైరెక్టర్ ఎస్.పాండ్యన్, శాస్తవ్రేత్తలతో కలిసి ప్రయోగవేదిక వద్దకు చేరుకొని కౌంట్‌డౌన్‌ను పరిశీలించారు. అనంతరం శాస్తవ్రేత్తలతో సమావేశమై ప్రయోగ వివరాలు అడిగి తెసుసుకున్నారు. కౌంట్‌డౌన్ జరిగే సమయంలో శాస్తవ్రేత్తలు రాకెట్‌లోని నాలుగో దశలో 1.6 టన్నుల ద్రవ ఇంధనం, రెండవ దశలో 41 టన్నుల ద్రవ ఇంధనాన్ని విజయవంతంగా నింపారు. రాకెట్‌లోని అన్ని భాగాల పనితీరును క్షుణంగా పరిశీలించిన అనంతరం హీలియం, నైట్రోజన్ గ్యాస్‌లను కూడా నింపే ప్రక్రియ పూర్తయింది. చివరిసారిగా రాకెట్‌కు గ్లోబల్ చెకింగ్ చేసిన అనంతరం మిషన్ కంట్రోల్ సెంటర్‌లోని సూపర్ కంప్యూటర్లకు అనుసంధానం చేసి ప్రయోగానికి ఎనిమిది గంటల ముందు రాకెట్‌కు విద్యుత్ సరఫరా ఇచ్చి మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి రాకెట్ ప్రయోగాన్ని పర్యవేక్షిస్తారు. 25గంటల కౌంట్‌డౌన్‌ను
నిర్విఘ్నంగా కొనసాగిన అనంతరం 0కు చేరుకోగానే షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం ఉదయం 5:30గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ 46 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ఏడాది ఇది మూడో ప్రయోగం కాగా పీఎస్‌ఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో 48వ ప్రయోగం. ఈ రాకెట్‌ను స్ట్ఫ్రాన్ బూస్టర్లు లేకుండా ప్రయోగిస్తున్నారు. ఈ తరహా ప్రయోగాల్లో 14వ ప్రయోగం కావడం వివేషం. 44.4మీటర్ల ఎత్తు, 290 టన్నుల బరువు కలిగిన పీఎస్‌ఎల్‌వీ-సీ 46 రాకెట్ భూమినుంచి నింగిలోకి ఎగిరిన అనంతరం తన నాలుగు దశలను 15.29నిమిషాల్లో పూర్తిచేసుకుని 615కిలోల బరువుగల రీశాట్-2బీ ఉపగ్రహాన్ని భూమికి 557కిలోమీటర్ల ఎత్తులో సూర్యనువర్తమాన కక్ష్యలో భూమధ్యరేఖకు 37డిగ్రీల ఏటవాలులో ప్రవేశపెట్టనున్నారు.
ఉగ్రవాద కదలికలపై నిఘా నేత్రం
దేశ రక్షణరంగ అవసరాల నిమిత్తం ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 615కిలోల బరువుగల రీశాట్-2బీ ఉపగ్రహాన్ని రోదసీలోకి పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా పంపుతున్నారు. ఈ సిరీస్‌లో 4వ ఉపగ్రహం కావడం విశేషం. ఇప్పటికే 2009 ఏప్రిల్ 20న పీఎస్‌ఎల్‌వీ-సీ12 రాకెట్ ద్వారా రీశాట్-2 ఉపగ్రహం, 2012 ఏప్రిల్ 26న పీఎస్‌ఎల్‌వీ-సీ19 ద్వారా రీశాట్-1 ఉపగ్రహం, 2016 సెప్టెంబర్ 26న పీఎస్‌ఎల్‌వీ-సీ 35 ద్వారా స్కాట్‌శాట్-1 ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఇప్పటికే వీటిసేవలు కూడా అందుతున్నాయి. వీటితో అనుసంధానమైన రీశాట్-2బీ భారత్‌కు అన్ని విధాలా ఉపకరిస్తుందని శాస్తవ్రేత్తలు తెలిపారు. దేశ సరిహద్దుల్లో ఉగ్రవాద స్థావరాలు, వారి కదిలికలపై నిశితంగా సమాచారం అందిస్తోంది. ఈ ఉపగ్రహంలో ఎక్స్‌బాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ అనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ రాడార్ దేశ సరిహద్దులను అనుక్షణం పహారా కాస్తూ ఉగ్రవాద శిబిరాలు, వారి కదలికలను ఎప్పటికపుడు పసిగడుతూ ఛాయాచిత్రాలను తీసిపంపడమే కాకుండా పూర్తి సమాచారాన్ని చేరవేస్తోంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో భూమిపై జరిగే వాతారణ మార్పులను గమనించేందుకు కూడా ఈ ఉపగ్రహం సహాయకారిగా పనిచేస్తుంది. రక్షణ రంగానికే కాకుండా వ్యవసాయం, అటవీశాఖకు, ప్రకృతి వైపరీత్యాలకు సేవలు అందించనుంది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు ప్రయోగించిన ఉపగ్రహాలు ఈ తరహా సేవలను అందిస్తున్నాయి. రీశాట్-2బీ ఉపగ్రహం కూడా అదే రకమైన సేవలను అందించనుంది. ఈ ఉపగ్రహం ఐదుసంవత్సరాల పాటు సేవలు అందించే విధంగా శాస్తవ్రేత్తలు రూపొందించారు.

చిత్రం...రీశాట్-2బి ఉపగ్రహం