జాతీయ వార్తలు

విరాళాల వివరాలు ఇవ్వని 17 ప్రాంతీయ పార్టీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 21: దేశ వ్యాప్తంగా 17 ప్రాంతీయ పార్టీలు 2017-18 సంవత్సరంలో తమకు అందిన విరాళాల వివరాలను ఎన్నికల కమిషన్‌కు అందజేయడంలో విఫలమయ్యాయని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) స్పష్టం చేసింది. ఎన్నికల్లో అవినీతిని అంతం చేయడానికి సంస్కరణలను తీసుకుని రావాల్సిన అవసరాన్ని ఎప్పటికప్పుడు చెప్పడంతో పాటు పౌరుల సాధికారత అంశంపై కూడా ఈ సంస్థ దీర్ఘకాలంగా కృషి చేస్తోంది. మొత్తం 48 ప్రాంతీయ పార్టీల్లో 15 పార్టీలు మాత్రమే నిర్ణీత కాల వ్యవధిలో ఎన్నికల కమిషన్‌కు తమకు లభించిన విరాళాల వివరాలు అందించాయని మరో 16 ప్రాంతీయ పార్టీలు గరిష్ట స్థాయిలో నెల రోజులకు పైగా జాప్యం చేశాయని ఈ సంస్థ తెలిపింది. అయితే 17 పార్టీలు మాత్రం ఈ విరాళాల నివేదికను ఈసీకి అందజేయలేదని వెల్లడించింది. వీటిలో అస్సాం గణపరిషత్, మిజో జాతీయ ఫ్రంట్, ఐఎన్‌ఎల్‌డీ తదితర పార్టీలు ఉన్నాయని తెలిపింది. మొత్తం 2,224 విరాళాల ద్వారా ఈ పార్టీలకు 20 వేల పైన, దిగువన అందిన మొత్తం 54.81 కోట్ల రూపాయలని ఈ సంస్థ తెలిపింది. నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజూ జనతాదళ్‌కు 15.04 కోట్ల రూపాయలను, నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీ(యూ)కు 11.19 కోట్లు విరాళాలుగా వచ్చాయని ఈ సంస్థ తెలిపింది. అత్యధిక స్థాయిలో 8.35 కోట్ల రూపాయల విరాళాలు పొందిన ప్రాంతీయ పార్టీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడవ అతి పెద్ద పార్టీగా నిలిచింది.