జాతీయ వార్తలు

కొత్త ఎంపీల కోసం.. సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికయ్యే నూతన సభ్యులకోసం లోక్‌సభ సచివాలయం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీవాస్తవ పార్లమెంట్ ఆవరణలో బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ కొత్త లోక్‌సభ సభ్యులకోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఎర్పాట్లూ చేస్తున్నట్టు చెప్పారు. అందుకోసం 56 నోడల్ అధికారులను నియమించామని, వీరు కొత్త ఎంపీలకు అందుబాటులో ఉంటారని వెల్లడించారు. కొత్తగా ఎన్నికైన లోక్‌సభ సభ్యులు ఢిల్లీకి వచ్చేటప్పుడు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఇచ్చే సర్ట్ఫికెట్లను తీసుకురావాలని సూచించారు. ఈ లోక్‌సభ సభ్యుల కోసం ఢిల్లీ విమానాశ్రయంలోనూ, ఢిల్లీలోని వివిధ రైల్వే స్టేషన్లలోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆమె చెప్పారు. కొత్త ఎంపీలకు గతంలో హోటళ్లలో వసతి ఏర్పాట్లు ఇచ్చేవారని.. కాని ఈసారి అవన్నీ రద్దు చేసినట్టు చెప్పారు. ఎంపీలకోసం ఢిల్లీలోని వెస్టర్న్ కోర్టు పరిధిలో నిర్మించిన నూతన భవనాలలో అన్ని వసతులూ సమకూర్చినట్టు వెల్లడించారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలు వారి జీవిత భాగస్వాములకు తాత్కాలిక పాస్‌లను ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఎంపీల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా చేస్తున్నట్టు వెల్లడించారు. లోక్‌సభ సభ్యులకు పోలీసు భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు సేహ్నలత శ్రీవాస్తవ వెల్లడించారు.
చిత్రం...పార్లమెంటు ఆవరణలో జరుగుతున్న పనులను పరిశీలిస్తున్న
లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీవాస్తవ