జాతీయ వార్తలు

మరో ఎమ్మెల్యే అసమ్మతి గళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 22: కాంగ్రెస్ పార్టీ కర్ణాటక శాఖలో మరో ఎమ్మెల్యే అసమ్మతి గళం వినిపించారు. లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై మాట్లాడుతున్న సందర్భంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (ఈవీఎంల) ట్యాంపరింగ్ అంశా న్ని ఎందుకు తీసుకొచ్చారని ఎమ్మెల్యే కె.సుధాకర్ ప్రశ్నించారు. సుధాకర్ అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరికి భిన్నంగా ఉంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనుండగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఇతర ప్రతిపక్షాలతో కలిసి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రతి అసెంబ్లీ ని యోజకవర్గం పరిధిలో సగం ఈవీఎంల వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని, ఒకవేళ ఈవీఎంలు, వీవీప్యాట్‌లలోని పోలయిన ఓట్ల సంఖ్యలో తేడా వస్తే మొత్తం వీవీప్యాట్‌లలోని స్లిప్పులను లెక్కించాలని డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో సీనియర్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ తమ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన మరుసటి రో జే సుధాకర్ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ప్ర దేశ్ కాంగ్రెస్ కమిటి (పీసీసీ) అధ్యక్షుడు దినేశ్ గుండూరావు నాయకత్వం విఫలమయిందని, రాష్ట్రానికి చెందిన పార్టీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక విదూషకుడని రోషన్ బేగ్ తీ వ్ర స్థాయిలో విమర్శించారు. కర్ణాటకలో ని కాంగ్రెస్-జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తరచుగా సమస్యలపై గొంతెత్తుతున్న సుధాకర్ తాజాగా ‘ఈవీఎంల ట్యాంపరింగ్, ఎగ్జిట్ పోల్స్ రెం డూ భిన్నమయిన అంశాలు’ అంటూ సామాజిక మాధ్య మం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు. ‘ఎగ్జిట్ పోల్స్ అంచనాల గురించి మా ట్లాడుతుండగా ఈవీఎంల ట్యాంపరింగ్ అంశాన్ని ఎందుకు తెచ్చారని నేను గందరగోళానికి గురయ్యాను. వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పోలింగ్ ముగిసిన తరువాత ఓటర్ల అభిప్రాయాన్ని ప్ర తిబింబిస్తాయి’ అని సుధాకర్ తన ట్వి ట్టర్‌లో పేర్కొన్నారు. ‘నేను ఎగ్జిట్ పోల్స్ గురిం చే మాట్లాడాను. ఈవీఎంల ట్యాంపరింగ్ అంశాన్ని ప్రస్తావించలేదు’ అని సుధాకర్ తరువాత ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు.