జాతీయ వార్తలు

రాహుల్ వల్లే ఐక్యత కొరవడింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 23: లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏను ఏమాత్రం ఎదుర్కోలేక చతికిలపడ్డ ప్రతిపక్షాలు ఒకరి తప్పులు ఒకరు వెదికే పనిలో పడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయాలే ప్రతిపక్ష కూటమిలో విభేదాలకు కారణమయ్యాయని సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ విధానాలే మోదీ మరోసారి గెలవడానికి దోహదపడ్డాయని గురువారం ఇక్కడ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అనూహ్య విజయం సాధించింది. 2014 ఎన్నికలకంటే ఎక్కువ సీట్లను కైవసం చేసుకుని ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టించారు. ‘ఈ ఎన్నికల్లో సామాజిక, మతపరమైన చీలికలు తెస్తూ బీజేపీ ఎన్నికలకు వెళ్లింది. అదే అజెండాతో ప్రచారం చేసి విజయం సాధించింది. అయితే ప్రతిపక్షాల ఐక్యతను కాంగ్రెస్ దెబ్బతీసింది. రాహుల్‌గాంధీ విధాన నిర్ణయాలు ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురాలేకపోయాయి’అని ఆయన ధ్వజమెత్తారు. చివరికి ఇవన్నీ మోదీ గెలుపునకు దోహదపడ్డాయని ఆయన విమర్శించారు. కాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యక్తులు, పార్టీలను నిందించడం సరైంది కాదని సీపీఐ పార్టీకే చెందిన మరో జాతీయ కార్యదర్శి డీ రాజా హితవుచెప్పారు. తమిళనాడులో ప్రతిపక్షాలు కలిసి పనిచేశాయని అందుకే బీజేపీ గాలి అక్కడ పనిచేయలేదని రాజా గుర్తుచేశారు. బీజేపీ హిందుత్వ భావజాలాన్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో లాభపడిందని ఆయన అభిప్రాయపడ్డారు. లౌకిక పార్టీలు ఈ విషయంలో ఘోరంగా విఫలమయ్యాయని ఆయన అన్నారు. ‘బీజేపీ జాతీయవాదం నినాదం ఈశాన్య రాష్ట్రాలు, కర్నాటకలో పనిచేసింది’అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్, వామపక్షాల మధ్య ఎన్నికల సమన్వయం లేకపోవడంతో బీజేపీకి కలిసొచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. అందులో భాగమే పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గెలుపునకు కారణమని ఆయన విశే్లషించారు. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ సమీకరణలు కుదిరాయని ఈ విషయంలో కాంగ్రెస్,లెఫ్ట్ పార్టీలు విఫలమయ్యాయని సురవరం అన్నారు. కేరళలో శబరిమల అంశం కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్‌కు కలిసొచ్చిందని, అందుకే రాహుల్ వాయనాడ్‌లో గెలిచారని ఆయన స్పష్టం చేశారు.