జాతీయ వార్తలు

ఎయిమ్స్ నుంచి జైట్లీ డిశ్చార్జి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 23: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అనారోగ్యం కారణంగా ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరి చికిత్స తీసుకున్నారు. 66 ఏళ్ల జైట్లీ సుమారుగా మూడు వారాల నుంచి విధులకు హాజరు కావడం లేదు. వైద్య పరీక్షల కోసం ఆయన ఎయిమ్స్‌లో చేరారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే జైట్లీ ఏ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని ఆ వర్గాలు వెల్లడించలేదు. వృత్తి రీత్యా న్యాయవాది అయిన జైట్లీ నరేంద్ర మోదీ కేబినెట్‌లో అత్యంత ముఖ్యమయిన నాయకుడిగా కొనసాగుతున్నారు. పలు సందర్భాల్లో ఆయన మోదీ ప్రభుత్వానికి చీఫ్ ట్రబుల్‌షూటర్‌గా వ్యవహరించారు. వరుసగా రెండోసారి ఏర్పడుతున్న మోదీ ప్రభుత్వంలో జైట్లీకి మంత్రి పదవి దక్కడ ఖాయం. అయితే, ఆయన అనారోగ్యమే ఆందోళనపరుస్తున్న అంశం.