జాతీయ వార్తలు

అందరికీ కృతజ్ఞతలు: వసుంధరా రాజె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్: ‘దూరదృష్టి గల నాయకత్వాన్ని’ గెలిపించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు’ అంటూ రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజె గురువారం కృతజ్ఞతలు తెలియజేశారు. బీజేపీకి ఓటు వేసి మరోసారి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరిచిన ప్రజలకు కృతజ్ఞతలు అని ఆమె పేర్కొన్నారు. నరేంద్ర మోదీ, అమిత్‌షాల నాయకత్వంలో దేశం మరింత ప్రగతి సాధిస్తుందని జైపూర్ గురువారం విలేఖరుల సమావేశంలో ఆమె అభిప్రాయపడ్డారు.
విజేతలకు మమత అభినందనలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో విజయం సాధించిన అభ్యర్థులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అభినందించారు. అయితే, మొత్తం వీవీప్యాట్‌లను సైతం సమీక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఓడిపోయిన వారంతా ఓటమి చెందినట్లు కాదని మమత ట్విటర్‌లో స్పష్టం చేశారు.
తమిళనాడు సీఎం అభనందనలు
చెన్నై: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి హర్షం వ్యక్తం చేశారు. ‘అద్భుత విజయాన్ని సాధించిన మీకు, మీ నాయకత్వంలోని ప్రభుత్వానికి హృదయపూర్వక అభినందనలు’ అంటూ నరేంద్ర మోదీకి గురువారం రాసిన లేఖలో ప్రశంసించారు.
చారిత్రక విజయం: ఫడ్నవిస్
ముంబయి: లోక్‌సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ దేశ అధ్యక్షుడు అమిత్‌షాలను మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ గురువారం అభినందించారు. ఇది ‘చారిత్రక విజయం’ అని ఆయన అభివర్ణించారు.
రజనీకాంత్ శుభాకాంక్షలు
చెన్నై: బీజేపీ తిరిగి భారీ మెజారిటీతో గెలుపొందడంతో ప్రధాని నరేంద్ర మోదీకి తమిళ సినీ నటుడు రజనీకాంత్ శుభాకాంక్షలు తెలిపారు. మోదీకి రజనీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను బట్టి బీజేపీ ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా మెజారిటీ సాధించింది. ప్రధాని మోదీ బాహుబలి అని, లోక్‌సభ ఎన్నికల్లో తరిగి ఆయనే ప్రధాని కావాలని రజనీ గత ఏడాది ఒక సందర్భంలో పేర్కొన్నారు. తానూ రాజకీయ పార్టీని స్థాపించనున్నానని, 2021 సంవత్సరంలో జరిగే రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో 234 అసెంబ్లీ స్థానాలకూ పోటీ చేస్తామని రజనీ కాంత్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాశ్మీర్ సమస్యకు పరిష్కారం ఆశిస్తున్నాం
శ్రీనగర్: కేంద్రంలో మరోసారి ఏర్పాటుకానున్న ఎన్డీయే ప్రభుత్వం కాశ్మీర్ సమస్యను పరిష్కరిస్తుందని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి వచ్చే ప్రభుత్వం చొరవ చూపి మరోసారి చర్చలకు నడుం బిగిస్తుందని ఆశిస్తున్నట్లు అబ్దుల్లా చెప్పారు. శ్రీనగర్‌లో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. శ్రీనగర్ పార్లమెంట్ స్థానంలో తన విజయాన్ని కాంక్షిస్తూ పార్టీ కార్యకర్తలు, నాయకులు చేసిన కృషిని మరువలేనని ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు.