జాతీయ వార్తలు

ఆది నుంచీ బీజేపీ ఆధిక్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 23: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన క్షణం నుంచే బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించడంతో, న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంతోపాటు, దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పార్టీ కార్యాలయాల్లో సంబరాలు మిన్నంటాయి. ప్రధాన కార్యాలయం పరిసరాలు మోదీ నామస్మరణతో మారుమోగాయి. ఉదయం నుంచే కార్యాలయం వద్దకు తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలు రాత్రి వరకూ నృత్యాలు చేస్తూ, పరస్పరం అభినందించుకుంటూ హడావుడిగా కనిపించారు. స్వీట్లు పంచుకున్నారు. గురువారం ఉదయం కౌంటింగ్‌పై టీవీలో ప్రసారాలు ప్రారంభమైన వెంటనే, బీజేపీ ఆధిక్యంపై వార్తలు వెలువడ్డాయి. దీనితో, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో న్యూఢిల్లీ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లోని ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ డాన్సులు చేస్తూ, బాణాసంచా కాలుస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. ‘మోదీ.. మోదీ’, ‘జై శ్రీరాం’, ‘్భరత్ మాతా కీ జై’ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. కార్యాలయం వెలుపల కార్యకర్తల హడావుడి కనిపిస్తే, లోపల కూడా సంబరాలు మిన్నంటాయి. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కటౌట్లతో కార్యాలయాన్ని నాయకులు నిపేశారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంగల బీజేపీ ఎంపీ రాకేష్ సిన్హా పార్టీ కార్యాలయంలో అందరికీ స్వీట్లు పంచారు. మోదీ ఇజానికి జనం పట్టం కట్టారని ఆయన వ్యాఖ్యానించారు. ఒకప్పటి నెహ్రూ ఇజం ఇప్పుడు మోడీ ఇజంతో తుడిచిపెట్టుకు పోయిందన్నారు. మోదీ పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పుగా ఆయన బీజేపీ విజయాన్ని అభివర్ణించారు. కాగా, మధ్యాహ్నం తర్వాత కార్యకర్తల సందడి మరింతగా పెరిగింది. ‘నమో ఎగైన్’, ‘చౌకీదార్ ఫిర్ సే’, ‘్ఫర్ ఏక్ బార్ మోదీ సర్కార్’ వంటి నినాదాలున్న టీ షర్టులు వేసుకొని, పరస్పరం అభినందించుకుంటూ కనిపించారు. అల్వార్ వంటి సుదూర ప్రాంతం నుంచి ఒక బృందం ప్రత్యేకంగా ఈ సంబరాల్లో పాలు పంచుకోవడం విశేషం. కొంత మంది చిత్రకారులు అక్కడ ఉన్న పిల్లల చేతులు, బుగ్గల మీద మోదీ పేరును రాశారు. మహిళలకు ప్రత్యేక నృత్యాలతో అలరించారు. బీజేపీ కార్యాలయం ఆవరణ మొత్తం కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. మోదీ ప్రభంజనాన్ని ఎవరూ అడ్టుకోలేరని పలువురు వ్యాఖ్యానించారు. ఇలావుంటే, దేశ వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల వద్ద ఇలాంటి వాతావరణమే కనిపించింది. స్థానిక నాయకులు, కార్యకర్తలతోపాటు అభిమానులు కూడా భారీ సంఖ్యలో చేరుకొని, సంబరాలు జరుపుకొన్నారు. సీట్లు పంచుకున్నారు. ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. పాటలు పాడారు. నృత్యాలు చేశారు. మోదీ నామస్మరణతో యావత్ దేశం మారుమోగిందనడంలో అతిశయోక్తి లేదు.