జాతీయ వార్తలు

16వ లోక్‌సభ రద్దు * కేబినెట్ తీర్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 24: ప్రధాన మంత్రి నరేంద్ర నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం రాజీనామా చేసింది. కేంద్ర మంత్రివర్గం శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలకు సౌత్ బ్లాక్‌లో చివరి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 17వ లోక్‌సభ కొలువుతీరనున్న దృష్ట్యా కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా రాజీనామా చేయాలని నిర్ణయించింది. ఎన్‌డీఏ మంత్రివర్గం రాజీనామా నిర్ణయం తీసుకునే ముందు 16వ లోక్‌సభను రద్దు చేయాలని కేబినెట్ తీర్మానించింది. 16వ లోక్‌సభ కాల పరిమితి జూన్ మూడో తేదీతో ముగుస్తోంది. లోక్‌సభ ఫలితాలు వెలువడ్డ నేపథ్యంలో అప్పటి వరకూ వేచిచూడకుండా మంత్రివర్గం రద్దుకు సిఫార్సు చేసింది. 16వ లోక్‌సభ రద్దు కావడంతో వెంటనే పదిహేడోవ లోక్‌సభ ఏర్పాటు జరిగిపోతుంది. కేంద్ర ఎన్నికల సంఘం 17వ లోక్‌సభకు ఎన్నికైన అభ్యర్థుల జాబితాను రాష్టప్రతికి అందచేయనుంది. రాష్టప్రతి దీనికి ఆమోద ముద్ర వేయడమే తరువాత కొత్త సభ జీవం పోసుకుంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి తమ మంత్రివర్గం రాజీనామా పత్రాన్ని అందజేశారు. దీంతోపాటు 16వ లోక్‌సభను రద్దు చేయాలంటూ కేబినెట్ ఆమోదించిన తీర్మానాన్ని కూడా ఆయన రాష్టప్రతికి అందజేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకూ పదవిలో కొనసాగాలని రామ్‌నాథ్ కోవింద్ ప్రధాన మోదీని మంత్రిని కోరారు.