జాతీయ వార్తలు

మీరే ఉండాలి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 25: పదిహేడవ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ చేసిన రాజీనామాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా తిరస్కరించింది. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజం కాబట్టి ఒకసారి ఓడిపోయినంత మాత్రాన రాహుల్ గాంధీ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయవలసిన అవసరం లేదంటూ మొత్తం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులందరు స్పష్టం చేశారు. అయితే రాహుల్ గాంధీ మాత్రం తన రాజీనామాను ఆమోదించాలంటూ పట్టుపడుతున్నట్లు తెలిసింది. పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేయవలసిందేనని ఆయన వాదిస్తున్నట్లు చెబుతున్నారు. గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్షుడుగా కొనసాగవలసిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడినట్లు తెలిసింది. రాజీనామా కోసం పట్టుపట్టకూడదని యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ ఆయనకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారనీ, అయితే రాహుల్ గాంధీ మాత్రం రాజీనామా ఆమోదం కోసం పట్టుపడుతున్నారని అంటున్నారు. పార్టీ ఓటమికి దారితీసిన పరిస్థితులను విశే్లషించి వాటిని సరిదిద్దుకోవటంతోపాటు ప్రజల మద్దతు సంపాదించేందుకు ప్రత్యేకంగా కృషి చేయాలని రాహుల్ గాంధీని కోరుతూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. కాంగ్రెస్ ప్రక్షాళనకు ప్రత్యేక చర్యలు తీసుకునే అధికారాన్ని సీడబ్లుసీ రాహుల్ గాంధీకి ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తున్నామని సీడబ్లుసీ ప్రకటించింది. లోక్‌సభలో ఒక బాధ్యతగల ప్రతిపక్షంగా నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఎప్పటికప్పడు ఒత్తిడి తీసుకువస్తాం.. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండేలా పని చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన శనివారం ఉదయం జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆమోదించిన తీర్మానం, తీసుకున్న నిర్ణయాల గురించి పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌సింగ్ సుర్జేవాలా, సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్, ఏకే ఆంటోని, వేణుగోపాల్, యువ నాయకులు గౌరవ్ గొగోయ్, సుశ్మితాదేవ్ తదితరులు ఏఐసీసీ కార్యాలయంలో విలేకరులకు తెలిపారు. రాహుల్ గాంధీ రాజీనామాను సీడబ్లుసీ ఏకగ్రీవంగా తిరస్కరించింది.. తన మార్గదర్శనంలో పార్టీని ముందుకు నడిపించాలని తీర్మానించిందని సుర్జేవాలా తెలిపారు. కాంగ్రెస్‌కు ఓటు వేసిన దాదాపు పనె్నండు కోట్ల మంది ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. దేశాభివృద్ధికి తమ పార్టీ ఎల్లవేళలా కట్టుబడి ఉంటుందని కాంగ్రెస్ ప్రకటించింది. దేశం ఇప్పుడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది.. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ తన వంతు కృషి చేస్తుందని తీర్మానంలో పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటకలో నెలకొన్న కరవు పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవలసిన అవసరం ఉన్నదని అన్నారు. ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థకు ముప్పు వాటిల్లుతోంది.. యువతకు ఉపాధి కరవవుతోంది.. రైతుల సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.. ఈ సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవలసిన అవసరం ఉన్నదని సీడబ్లుసీ అభిప్రాయపడింది. కాంగ్రెస్ మరింత బాగా పనిచేస్తే బాగుండేదని ఏకే ఆంటోని ఒక ప్రశ్నకు బదులిస్తూ చెప్పారు. ఎన్నికల ఫలితాలను విశే్లషిస్తున్నాం.. ఓటమికి దారితీసిన పరిస్థితులను మరింత లోతుగా అధ్యయనం చేసిన అనంతరం కాంగ్రెస్‌ను పటిష్టం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది నిర్దారిస్తామని అంటోని చెప్పారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి దారితీసిన పరిస్థితులను విశే్లషించారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఒక విలేఖరి సూచించగా అది నిజం కాదన్నారు. కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరం ఉన్నది.. అందుకే పార్టీని ప్రక్షాళన చేసే అధికారం రాహుల్ గాంధీకి ఇవ్వటం జరిగిందిన సుర్జేవాలా చెప్పారు. రాహుల్ గాంధీ రాజీనామా ప్రతిపాదనను సీడబ్లుసీ సభ్యులంతా ఏకగ్రీవంగా తిరస్కరించారని ఆజాద్ చెప్పారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షం నాయకత్వ పదవిని కేవలం రాహుల్ గాంధీ మాత్రమే నిర్వహించగలుగుతారని ఆజాద్ తెలిపారు. కాంగ్రెస్‌కు రాహుల్ అవసరం ఎంతో ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఒక సీనియర్ నాయకుడి పేరును ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయని ఒక విలేఖరి సూచించగా అలాంటిదేదీ లేదు.. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు తప్ప ఎవరి పేరూ ప్రతిపాదించలేదని ఆజాద్, సుర్జేవాలా స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు రాహుల్ అవసరం ఎంతో ఉన్నదని వారు స్పష్టం చేశారు. గాంధీ కుటుంబం నాయకత్వం వహించకపోతే కాంగ్రెస్ ఎక్కడుంటుందని విలేఖరుల సమావేశానంతరం పార్టీ సీనియర్ నాయకుడొకరు చెప్పారు.