జాతీయ వార్తలు

కొలువుదీరండి నరేంద్ర మోదీకి రాష్టప్రతి ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 25: కేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ నాయకుడు నరేంద్ర మోదీని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఆహ్వానించారు. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం రాత్రి తొమ్మిది గంటలకు నరేంద్ర మోదీకి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సంబంధించిన ఆహ్వాన లేఖను అందజేశారు. ప్రమాణ స్వీకారం ఎప్పుడు.. ఎక్కడ ఉంటుందనే వివరాలు వీలున్నంత త్వరగా తెలియజేస్తామని మోదీ రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు చెప్పారు. మొదట ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీల నాయకులు, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, అకాలీదళ్ అధినాయకుడు ప్రకాశ్ సింగ్ బాదల్, శివసేన అధినాయకుడు ఉద్ధవ్ థాక్రే, ఎల్‌జేపీ అధినాయకుడు రాంవిలాస్ పాశ్వాన్, అన్నా డీఎంకే నాయకుడు ఫళణిస్వామి తదితరులు రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి నరేంద్ర మోదీని తమ నాయకుడిగా ఎన్నుకున్నట్లు తెలియజేశారు. ఇది జరిగిన అనంతరం రామ్‌నాథ్ కోవింద్ నరేంద్ర మోదీని
రాష్టప్రతి భవన్‌కు పిలిచి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానించారు. దేశ ప్రజలు తమకు అత్యంత బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు.. ఈ మెజారిటీకి ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు ముడిపడి ఉన్నాయి.. వీటిని పూర్తి చేసేందుకు తాను చిత్తశుద్ధితో కృషిచేస్తానని నరేంద్ర మోదీ రాష్టప్రతి భవన్ ప్రాంగణంలో విలేఖరులకు చెప్పారు. ప్రజల ఆశయాల సాధన కోసం మరింత వేగంతో ముందుకు వెళతాం.. విశ్రాంతి, విరామం ఉండదని మోదీ ప్రకటించారు. అందరి వెంట అందరి అభివృద్ధితో పాటు అందరి విశ్వాసం తమ లక్ష్యమని అన్నారు. పేదరికం నిర్మూలనకు అత్యధిక ప్రాధాన్యత.. అందరికీ భద్రత తమ బాధ్యత అని మోదీ ప్రకటించారు.