జాతీయ వార్తలు

ఇది ప్రజాస్వామ్యానికి ఆశీర్వాదం: అమిత్ షా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 25: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అత్యంత విస్తృత స్థాయిలో ప్రజలు అందించిన విజయం ప్రజాస్వామ్యానికి లభించిన ఆశీర్వాదం అని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. 1960 దశకం నుంచి కూడా అనవంశిక పాలన, కులాల సమరాలు, ఓటు రాజకీయాలతోనే భారత్ మగ్గిపోయిందని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రజలు తాజాగా ఇచ్చిన తీర్పు ఈ రుగ్మతల నుంచి దేశానికి విముక్తి కలిగించిందని పేర్కొన్న ఆయన ‘ఇది పనికి పట్టం కట్టే రాజకీయాలకు లభించిన జనాఆమోద ముద్ర’ అని అభివర్ణించారు. ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడిన అమిత్ షా ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా పని చేయడం వల్లే దేశ ప్రజలు నరేంద్ర మోదీకి రెండో సారి కూడా అధికారాన్ని అప్పగించారని అన్నారు. మొదట ఐదేళ్ళ పాలనలో సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది మంది పేదలకు ఆయన ప్రయోజనం కలిగించారని గుర్తు చేశారు. తాజా ఎన్నికల ఫలితాలు మోదీ సునామీగా అభివర్ణించిన అమిత్ షా భారత దేశాన్ని సూపర్ పవర్‌గా ప్రజలు చూడాలనుకోవడం వల్లే మోదీ నాయకత్వానికి తిరుగు లేని ఆదరణను కనబరిచారని తెలిపారు. అలాగే అంతర్జాతీయంగా భారత దేశానికి సరైన గుర్తింపు అందించాలన్న ప్రజాకాంక్ష కూడా ఈ తీర్పులో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. నవ భారత నిర్మాణ దిశగా బలమైన పునాదులతో నరేంద్ర మోదీ ముందుకు సాగగలరన్న ఆశాభావాన్ని ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. అలాగే మొత్తం ప్రపంచ దేశాలు కీర్తించే విధంగా ప్రజాస్వామ్య కలలను కూడా మోదీ సాకారం చేయగలరన్న నమ్మకం తనకు ఉందన్నారు.
బీజేపీకి లభించిన భారీ విజయం వెనుక ఓ సరికొత్త రాజకీయ అర్థం కూడా ఉందని, ఒక రకంగా చెప్పాలంటే ప్రజాతీర్పు ప్రజాస్వామ్యానికి లభించిన ఆశీర్వాదం అని అన్నారు. 1960 దశకం నుంచి కూడా ప్రతి ఎన్నికల్లోనూ అనువంశికత, కులతత్వం, బుజ్జగింపు అనే రుగ్మతలు దేశ రాజకీయాల్లో తాండవిస్తూనే వచ్చాయని అమిత్ షా గుర్తు చేశారు. 2019లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఈ రుగ్మతలకు చరమ గీతం పాడిందని, అన్ని విధాలుగా దేశానికి విముక్తిని కల్పించిందని ఆయన తెలిపారు. జాతీయ భద్రత విషయంలో ఈ ఐదేళ్ళలో మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాత్మక చర్యలను అమిత్ షా ఈ సందర్భంగా ప్రస్తావించారు. 1990 నుంచి కూడా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జాతీయ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న భావన ప్రజల్లో ఉండేదని, కానీ బాలాకోట్‌పై వైమానికి దాడులు చేయడం వల్ల ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ భద్రతకు వెన్నుదన్నుగా నిలిచారని అమిత్ షా తెలిపారు. అంతేకాదు ఉగ్రవాదుల స్థావరాల్లోకి చొచ్చుకెళ్ళి మరి వారిని అంతం చేయగలిగే నాయకుడు లభించాడన్న నమ్మకం ప్రజల్లో కలిగిందన్నారు.
ముస్లింలకు భద్రత ప్రధాని మోదీ భరోసా
ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
న్యూఢిల్లీ, మే 25: దేశంలోని ముస్లింలు, ఇతర మైనారిటీలకు పూర్తి భద్రత కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. నరేంద్ర మోదీ శనివారం ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా ఎన్నికైన అనంతరం ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతూ ముస్లింలకు మొదటి నుండి మోసం జరిగిందన్నారు. దేశంలోని అన్ని వర్గాల వారి ప్రయోజనాలను కాపాడటం తమ బాధ్యత అని ఆయన తెలిపారు. ఎంపీలు కూడా అన్ని వర్గాలు, ప్రాంతాల అభివృద్దికి కృషి చేయాలని హితవు చెప్పారు. తమకు ఓటు వేసిన వారితోపాటు ఓటు వేయని వారు, వ్యతిరేకించిన వారి అభివృద్ది కోసం కూడా కృషి చేయాల్సిన బాధ్యత మనపై ఉన్నదని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.