జాతీయ వార్తలు

అందరికీ మంత్రి పదవులు సాధ్యం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 25: మంత్రి పదవుల కోసం ప్రయత్నించవద్దు.. మంత్రి పదవి ఇప్పిస్తామనే వారి మాటలు నమ్మవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభకు ఎన్నికైన బీజేపీ, ఎన్‌డీఏ ఎంపీలకు హితవు పలికారు. శనివారం పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా ఎన్నికైన అనంతరం మాట్లాడుతూ ఎంపీ లందరూ తనకు కావలసినవారే.. కొందరు తనవారు.. కొందరు పరాయివారు అంటూ ఉండరు.. అందరూ నావారే.. అయితే అందరికీ మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాదు.. కొందరికి మాత్రమే బాధ్యతలు లభిస్తాయి అని తెలిపారు. మంత్రి పదవుల కోసం ప్రయత్నించటం.. మంత్రి పదవి ఇప్పిస్తాం.. నాకు వారు తెలుసు.. వీరు తెలుసంటూ వచ్చేవారిని విశ్వసించవద్దు.. వారితో వెళ్లకూడదని మోదీ స్పష్టం చేశారు. మంత్రి పదవుల కోసం ప్రయత్నించవద్దని ఆయన ఎంపీలకు సూచించారు. మంత్రి పదవులు ఇప్పిస్తామని చెప్పేవారు ఢిల్లీలో చాలామంది ఉంటారు.. వారినుండి దూరంగా ఉండాలని ఆయన ఎంపీలను హెచ్చరించారు.
వీఐపీ సంస్కృతిని విడనాడాలి
వీఐపీ సంస్కృతిని విడనాడాలని ఆయన ఎంపీలకు స్పష్టం చేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో దిగగానే చెకింగ్ చేసేవారిపై చిరాకుపడటం మానివేయాలన్నారు. ఎంపీ కాబట్టి తనను చెక్ చేయకూడదనే ఆలోచన ఎంత మాత్రం మంచిది కాదు.. మనం ఎంపీలయ్యేందుకు ముందు సామాన్య పౌరులం.. దానిని ఎప్పుడు మరిచిపోరాదని అన్నారు. కారుపై ఎర్ర బల్బును తొలగించటం పట్ల దేశ ప్రజలు ఎంతో సంతోషించారు. ప్రజలు వీఐపీ సంస్కృతిని అంగీకరించటం లేదనే వాస్తవాన్ని గ్రహించాలన్నారు. ప్రజలకు సేవ చేయటం మన లక్ష్యం, దానిని సాధించేందుకు కృషి చేయాలని అన్నారు. మంత్రి పదవుల కోసం ప్రయత్నించవద్దు.. వీఐపీ సంస్కృతిని వదిలివేయాలి.. మీడియకు దూరంగా ఉండాలన్న మాటలు మీకు నచ్చకపోవచ్చు అని మోదీ అన్నారు. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కృషిచేయాలి.. ఓటు వేసినవారు, వేయనివారనే తేడా చూపించకూడదని అన్నారు.
మీరు పార్లమెంటు సభ్యులు.. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు గల అన్ని రాష్ట్రాలు, ప్రాంతాల గురించి ఆలోచించాలి.. కేవలం మీ నియోజకవర్గం గురించి మాత్రమే ఆలోచించటం మానివేయాలని అన్నారు. మీ నియోజకవర్గం అభివృద్ది కూడా ముఖ్యమే.. అయితే దీనితోపాటు ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలు కూడా ముఖ్యమనేది గ్రహించాలని అన్నారు. జాతీయ స్థాయికి ఎదగాలని ఆయన ఎంపీలకు పిలుపు ఇచ్చారు.