జాతీయ వార్తలు

నూతన శకానికి నాంది పలుకుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మే 26: లోక్‌సభ ఎన్నికలో ప్రజా తీర్పు నేపథ్యంలో నవ భారత శకంలో అత్యున్నత రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్‌ను తీర్చిదిద్దడం అత్యవసరమని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అభిప్రాయపడ్డారు. ప్రజా సంక్షేమం పేరుతో కుల రాజకీయాలను చేసిన పార్టీలకు ప్రజలు సరైన విధంగా బుద్ధి చెప్పారని ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. మా ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెట్టిన కారణంగానే ప్రజలు బీజేపీకి మద్దతు తెలిపారని ఆదివారం ఇక్కడ పేర్కొన్నారు. అవకాశవాద రాజకీయాలకు తెరలేపిన ఎస్పీ, బీఎస్పీలకు తగిన బుద్ధి చెబుతూ ప్రజలు బీజేపీకి ఓటు వేసి మద్దతు పలికారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించడానికి కేవలం ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాలే ముఖ్య కారణమని, ఈ ఖ్యాతి వారికే దక్కుతుందని సీఎం వెల్లడించారు. బంధుప్రీతి, కుల వ్యవస్థ, అవినీతి నిర్మూలనే తమ పార్టీ ప్రధాన ధ్యేయమని చెప్పారు. ఈ మూడు అంశాలపై పోరాటమే బీజేపీపై ముందున్న ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమం పేరుతో కపట ప్రేమను వల్లించే పార్టీలకు తగిన శాస్తి జరిగిందని అనిప్రాయపడ్డారు. గూండాయిజం పేరుతో పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల నుంచి సుంకాలు వసూలు చేసే ఎస్పీ లాంటి అవివేక పార్టీలకు తగిన గణపాఠాన్ని బీజేపీ చెప్పిందని అన్నారు. 55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధికీ తన ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రధాని మోదీ తన ఎన్నికల ర్యాలీలో సరైన రీతిలో వివరించగలిగారనీ, అలాగే, రెండేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని తాను కూడా సక్రమంగా చెప్పగలిగానని ఆదిత్యనాథ్ చెప్పారు. రాజకీయ, అధికార వర్గాల్లో రెండేళ్ల క్రితం ఉండే అవినీతిని పూర్తిగా రూపుమాపగలిగామని సీఎం స్పష్టం చేశారు.
కుల, మత, రాజకీయాలకు అతీతంగా నేరస్థులపై కఠిన వైఖరిని తమ ప్రభుత్వం అవలంబించడం వల్లే పారదర్శక పాలన సాధ్యమైందని చెప్పారు. గూండాయిజం అణచివేతలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అవలంబించిన వైఖరినే అనుసరించాలని పంజాబ్, హర్యానా హైకోర్టు ఇటీవల అక్కడి ప్రభుత్వాలను ఆదేశించడం వెనుక తమ ప్రభుత్వ పనితీరు స్పష్టంగా తేటతెల్లవౌతోందని చెప్పారు.