జాతీయ వార్తలు

మాల్దీవుల్లోనే మోదీ తొలి పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 26: లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి, రెండోసారి కేంద్రంలో అధికార పగ్గాలను చేపట్టనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధానిగా ఈనెల 30న పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చే నెలలో తొలిసారిగా ద్వీపకల్పం మాల్దీవుల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ విషయాన్ని మాల్దీవుల రాయబార వర్గాలు తెలిపినట్టు ఇక్కడి మీడియా పేర్కొంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా భూటాన్‌లో పర్యటించారు. అదేవిధంగా ఈఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలుత జూన్ రెండో వారంలో అంటే జూన్ 7-8 తేదీల మధ్య మాలెలో పర్యటించనున్నారని మాల్దీవుల మీడియా వర్గాలు తెలిపాయి.
గత ఏడాది నవంబర్‌లో మాల్దీవుల్లో అధికారంలోకి వచ్చిన ప్రెసిడెంట్ ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్‌తో ఆమె తొలిసారిగా భారత్ తరఫున తొలిసారిగా పూర్తిస్థాయి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. నరేంద్ర మోదీ సైతం మాల్దీవుల కొత్త అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ ప్రమాణ స్వీకారానికి సైతం వెళ్లారు. మాల్దీవులపై పొరుగు దేశం చైనా ఆధిపత్యాన్ని కనబరచే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో భారత్ స్నేహ సంబంధాలు అందిస్తామని మోదీ మాల్దీవుల అధ్యక్షుడిగా భరోసా ఇచ్చారు.
ఇదిలావుండగా, భారత్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి ఘన విజయాన్ని సాధించిన నరేంద్ర మోదీని మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ అభినందించారు.