జాతీయ వార్తలు

హోదా కోసం పట్టుబట్టండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, మే 26: ‘ఒడిశాకు ప్రత్యేక హోదా సాధించే వరకూ పట్టుబట్టండి, కేంద్రంపై వత్తిడి తీసుకుని రండి..’ అని బిజూ జనతాదళ్ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తమ పార్టీ ఎంపీలకు సూచించారు. ఇటీవల ఒడిశా రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేడీ విజయం సాధించింది. అదేవిధంగా లోక్‌సభ ఎన్నికల్లో 12 మంది ఎంపీలు గెలుపొందారు. ఈ సందర్భంగా నవీన్ పట్నాయక్ ఆదివారం పార్టీ ఎంపీలతో సమావేశమై వారికి పలు సూచనలు చేశారు. సమావేశానంతరం ఆ పార్టీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి చంద్రశేఖర్ సాహు (బరహంపూర్) మీడియాతో మాట్లాడుతూ కేంద్రంతో పార్టీ అనుసరించే వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. తమ పార్టీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ మూడు ముఖ్యమైన సలహాలు ఇచ్చారని ఆయన తెలిపారు. కేంద్రంపై వత్తిడి తెచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలని, తరచూ వర్షాలు, తుఫాన్ల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను పునరుద్ధరించేందుకు అధిక మొత్తంలో నిధులు సమీకరించాలని, చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టం చేయాలని కేంద్రంపై పోరాటం చేయాలని సూచించినట్లు ఆయన తెలిపారు. ఒడిశా రాష్ట్ర ప్రజల హక్కుల కోసం తాము శక్తివంచన లేకుండా పోరాటం చేస్తామని ఎంపీ సాహు తెలిపారు.
కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి
పట్నాయక్‌కు గవర్నర్ ఆహ్వానం
ఒడిశా రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్‌కు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆ రాష్ట్ర గవర్నర్ ప్రొఫెసర్ గణేష్ లాల్ ఆహ్వానించారు. ఆ రాష్ట్రంలోని 146 సీట్లలో బీజేడీ 112 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ మేరకు ఈ నెల 29న స్థానిక ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రమాణ స్వీకారానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.