జాతీయ వార్తలు

మద్దతుదారులతో మాట్లాడి చెబుతా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 26: బీజేపీకి మద్దతునిచ్చే విషయంలో తనను గెలిపించిన మద్దతుదారులతో, ఓటర్లతో చర్చించిన తర్వాతే చెబుతానని కర్నాటకలోని మంద్య లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన సినీ నటి సుమలత అంబరీష్ తెలిపారు. మంద్య లోక్‌సభ స్థానంలో కర్నాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తనయుడు నిఖిల్‌ను ఆమె ఓడించారు. అయితే ఆమె పోటీ చేసిన మంద్య లోక్‌సభ స్థానంలో బీజేపీ అధినాయకత్వం అభ్యర్థిని బరిలోకి దించకుండా సుమలత అభ్యర్థిత్వాన్ని బలపరిచింది. ఫలితంగా సుమలత ఘన విజయం సాధించారు. దీంతో ఆమె ఆదివారం బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని తన మద్దతుదారులు, ఓటర్లతో చర్చించి బీజేపీకి మద్దతునిచ్చే విషయంలో నిర్ణయం తీసుకుంటానన్నారు. ఇలాఉండగా ఆమె ఆదివారం కర్నాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యెడ్యూరప్పను, పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణను కలిసి ఎన్నికల్లో తనకు మద్దతునిచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా సుమలత తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ ఇండిపెండెంట్‌గా గెలుపొందిన అభ్యర్థులు ఏదైనా పార్టీలో చేరే విషయంలో రాజ్యాంగంలో నియమాలు ఏమీ లేవన్నారు.
అయితే అంశాల వారీగా మద్దతునివ్వవచ్చన్నారు. త్వరలో నియోజకవర్గంలోని ప్రతి తాలూకాను సందర్శించి భవిష్యత్ కార్యాచరణపై వారి అభిప్రాయాలను సేకరించి తాను ఒక నిర్ణయానికి వస్తానని ఆమె తెలిపారు. కేంద్రంలో బీజేపీ రెండో సారి అధికారాన్ని చేపట్టనున్నందుకు, కర్నాటకలో బీజేపీ ఘన విజయం సాధించినందుకు అభినందిస్తున్నానని అన్నారు.
యెడ్యూరప్ప శుభాకాంక్షలు
ఇలాఉండగా యెడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ సుమలతకు శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని మద్దతుదారులతో సుమలత చర్చించిన అనంతరం తమ పార్టీకి మద్దతునిచ్చే విషయంలో నిర్ణయం తీసుకోనున్నారని ఆయన చెప్పారు. మంద్య లోక్‌సభ స్థానంలో ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్‌పై ఆమె 1,25,876 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సుమలత (55) ప్రముఖ నటుడు, దివంగత అంబరీష్‌కు సతీమణి.