జాతీయ వార్తలు

ఉప రాష్టప్రతి వెంకయ్యతో మోదీ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 26: బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ఘన విజయం సాధించి, రెండో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్న నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం ఉప రాష్టప్రతి ఎం. వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసారు. ఎన్డీఏ నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నికై, మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న మోదీకి ఉప రాష్టప్రతి పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందించారు. తొలుత ఇరువురూ అల్పాహారం స్వీకరించారు. అనంతరం అనేక అంశాలపై మంతనాలు జరిపారు. ముఖ్యంగా పార్లమెంటరీ వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టవంతం చేసేందుకు చేపట్టాల్సిన విషయాలపైనా ఇరువురూ చర్చించినట్లు ఉప రాష్టప్రతి కార్యాలయం ట్వీట్ చేసింది. మోదీ కూడా ఉప రాష్టప్రతిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఉప రాష్టప్రతిని కలిసినప్పటి రెండు ఫొటోలను కూడా ఆయన పెట్టారు. శనివారం జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నరేంద్ర మోదీని ఎన్డీఏ పక్షం నాయకునిగా ఎన్నుకోవడానికి తీర్మానాన్ని ప్రతిపాదించడంతో సభ్యులు హర్షాతిరేకాలతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ కుల, మతాలకు అతీతంగా ఎంపీలు నవ భారత నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనాదిగా అన్యాయాలకు గురవుతున మైనారిటీల విశ్వాసాన్ని చూరగొనాలని అన్నారు. ఎన్నికల్లో బీజేపీ-ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలకు 353 సీట్లు లభించాయి.