జాతీయ వార్తలు

ఆ వార్తలు నమ్మకండి.. జైట్లీ ఆరోగ్యంపై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 26: బీజేపీ అగ్ర నాయకుడు, ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కీలకమైన ఆర్థిక శాఖను నిర్వహించిన అరుణ్ జైట్లీ అనారోగ్యానికి గురైనట్లు జరుగుతున్న ప్రచారాన్ని, మీడియాలో వస్తున్న కథనాలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. మీడియాలో ఒక సెక్షన్ పనిగట్టుకుని చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని కేంద్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి సీతాంశు కర్ ఆదివారం ట్విట్టర్‌లో ప్రజలను కోరారు. మీడియా స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన కోరారు. గత వారం ఢిల్లీలోని ఏయిమ్స్‌లో జైట్లీ చేరి చికిత్స పొంది, గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయినప్పటికీ శనివారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరుకాకపోవడం, పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విజయోత్సవ సభల్లో పాల్గొనకపోవడంతో వదంతులు మరింతగా వ్యాపించాయి. ఇలాఉండగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జైట్లీ కళాశాల స్నేహితుడు రజత్ శర్మ తెలిపారు. కొంత కాలం విశ్రాంతి కోసం లండన్ లేదా అమెరికా వెళ్ళాల్సిందిగా బంధు, మిత్రులు సూచిస్తున్నారని ఆయన చెప్పారు. సందర్శకులను కలవడం మంచిది కాదని వైద్యులు సలహా ఇచ్చారని ఆయన తెలిపారు.