జాతీయ వార్తలు

ఐదేళ్లలో భారత్‌కు పునర్ వైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, మే 26: అంతర్జాతీయ స్థాయిలో భారత దేశానికి తగిన గుర్తింపు తెచ్చేందుకు రానున్న ఐదేళ్ళ కాలంలో గట్టిగా కృషి చేస్తానని ప్రధాని నరేం ద్ర మోదీ ఆదివారం నాడిక్కడ ఉద్ఘాటించారు. అంతర్జాతీయంగా భారత్‌కు ఒకప్పుడు ఉన్న గుర్తింపును పునఃప్రతిష్టించేందుకు రానున్న ఐదేళ్ల కాలాన్ని వినియోగించుకుంటామని మోదీ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో ఇక్కడ జరిగిన ఓ సభలో మాట్లాడిన మోదీ ‘1942 నుంచి 1947 మధ్య కాలంలో ఎంతటి కీలక పరిణామాలు భారత్‌లో చోటు చేసుకున్నాయో అంతటి కీలక ప్రాధాన్యత రానున్న ఐదేళ్ళకూ ఉంది’ అని వెల్లడించారు. సూరత్ అగ్ని ప్రమాదం నేపథ్యంలో అత్యంత సాధారణ రీతిలోనే ఈ సమావేశం జరిగింది. అంతర్జాతీయంగా భారత్‌కు గతంలో నిరూపమానమైన స్థానం ఉండేదని, దానిని తిరిగి సాధించుకోవడానికి రానున్న ఐదేళ్ల కాలం కీలకంగా మారబోతుందని తెలిపారు. కచ్చితంగా భారత్ ప్రపంచ స్థాయిలో తిరిగి తన స్థా నాన్ని పునరుద్ధరించకోగలదన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
అగ్నిప్రమాదంలో 22మంది విద్యార్థు లు దుర్మరణం చెందిన సంఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన మోదీ ‘ఈ అభినందన సభకు రావాలా? వద్దా? అని నిన్నటి వరకు నేను ద్వైదీ భావనలోనే ఉన్నాను. ఒక పక్క కర్తవ్యం, మరోపక్క కరుణ నన్ను సందిగ్ధం లో పడేసాయి. పిల్లలను కోల్పోయిన ఆ కుటుంబాల విషాదాన్ని ఎవరూ తీర్చలేరు’ అని అన్నారు. తనను గెలిపించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయడం, అలాగే తన మాతృమూర్తి ఆశీర్వాదం తీసుకోవడం కర్తవ్యంగా భావించానని మోదీ తెలిపారు.