జాతీయ వార్తలు

సీఎం పదవికి రాజీనామా చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మే 26: ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే ఘోర పరాజయం పాలయినందున ముఖ్యమంత్రి ఎడప్పడి కె పళనిస్వామి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డీఎంకే నాయకుడు ఎంపీ దయానిధి మారన్ డిమాండ్ చేశారు. మారన్ ఆదివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ‘లోక్‌సభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే ఘోర పరాజయానికి ఎడప్పడి కె పళనిస్వామి నైతిక బాధ్యత వహించితీరాలి. ఆ పార్టీ ధనబలాన్ని ప్రయోగించినప్పటికీ కేవలం ఒకే ఒక స్థానంలో గెలవగలిగింది. అందువల్ల పళనిస్వామి వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి’ అని అన్నారు. ఏఐఏడీఎంకే అభ్యర్థుల్లో కేవలం రవీంద్రనాథ్ కుమార్ తమిళనాడులోని తెనీ లోక్‌సభ నియోజకవర్గంలో గెలిచారు. తమిళనాడులో డీఎంకే 23 నియోజకవర్గాల్లో, కాంగ్రెస్ పార్టీ ఎనిమిది నియోజకవర్గాల్లో గెలిచాయి. సీపీఐ, సీపీఎంలు చెరో రెండు నియోజకవర్గాల్లో విజయం సాధించాయి. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్), విదుతలై చిరుతైగల్ కచి పార్టీలు చెరో స్థానంలో గెలిచాయి. ఎన్‌డీయేకు మిత్ర పక్షమయిన, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఏఐఏడీఎంకే ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలుకావడం చర్చనీయాంశమయింది. దేశవ్యాప్తంగా మొత్తం 542 లోక్‌సభ నియోజకవర్గాలలో బీజేపీ, దాని భాగస్వామ్య పక్షాలు కలిసి 353 స్థానాల్లో విజయం సాధించగా, తమిళనాడులో దాని మిత్రపక్షమయిన ఏఐఏడీఎంకే ఘోర పరాజయం పాలయింది.