జాతీయ వార్తలు

8న ఇన్‌శాట్-3 డిఆర్ ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 1: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సన్నాహం చేస్తోంది. నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ షార్ నుండి ఈ నెల 8న జిఎస్‌ఎల్‌వి-ఎఫ్ 05 రాకెట్ ప్రయోగం జరిపేందుకు ఇస్రో మూహూర్తం ఖరారు చేసింది. ఈ రాకెట్ ద్వారా మన దేశానికి చెందిన 2200 కిలోల బరువుగల ఇన్‌శాట్-3డిఆర్ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన చివరి మిషన్ రెడీనెష్ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్) ఈ నెల 5న డాక్టర్ బి ఎన్.సురేష్ అధ్యక్షతన షార్‌లో జరగనుంది. ఈ సమావేశంలో షార్ డైరెక్టర్ పి.కున్హికృష్ణన్ పలువురు సీనియర్ శాస్తవ్రేత్తలు పాల్గొని సుదీర్ఘంగా చర్చించినంతరం ప్రయోగ సమయాన్ని తదితర అంశాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే షార్‌లోని రెండో ప్రయోగ వేదిక వద్ద రాకెట్ నాలుగు దశల అనుసంధాన పనులు పూర్తియ్యాయి. ఉపగ్రహాన్ని చివరి భాగంలో అమర్చే ప్రక్రియలో శాస్తవ్రేత్తలు నిమగ్నమై ఉన్నారు. ఆగస్టు 28న జరగాల్సిన ఈ రాకెట్ ప్రయోగం ఉపగ్రహంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగాన్ని 10రోజులు వాయిదా వేశారు.
28న పిఎస్‌ఎల్‌వి-సి 35 ప్రయోగం
ఈ నెల 28న పిఎస్‌ఎల్‌వి-సి 35 రాకెట్ ద్వారా స్వదేశీ, విదేశాలకు చెందిన 8 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన పనులు ఆగస్టు 22న ప్రారంభమై చురుకుగా సాగుతున్నాయి. మొదటి ప్రయోగ వేదిక నుండి ప్రయోగించే ఈ రాకెట్ ద్వారా మన దేశానికి చెందిన 370కిలోల బరువుగల స్క్యాట్‌శాట్-1 ప్రధాన ఉపగ్రహం, బొంబాయి ఐఐటి విద్యార్థులు రూపొందిచిన 50కిలోల బరువుగల ఫ్రాతమ్ ఉపగ్రహం, మరో ఇంజినీరింగ్ విద్యార్థులు రూపొందించిన 5.3కిలోల బరువుగల ఫైశాట్ ఉపగ్రహంతో పాటు ఫ్రాన్సు దేశానికి చెందిన ఆల్‌శాట్-1బి, ఆల్‌శాట్-2బి, ఆల్‌శాట్-1 ఎన్, అమెరికాకు చెందిన పాత్‌ఫైండర్ అనే దూరపరిశీలన ఉపగ్రహాలను ఒకేసారి పిఎస్‌ఎల్‌వి రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే రాకెట్ రెండు దశల అనుసంధాన పనులు పూర్తయ్యాయి. మూడో దశ పనులు పూర్తయ్యినంతరం రాకెట్ చివరి భాగంలో ఉపగ్రహాలను అమర్చి ప్రయోగానికి సిద్ధం చేస్తారు. ఈ నెలలో రెండు ప్రయోగాలు ఉండడంతో షార్‌లో సందడి వాతావరణం నెలకొనింది.

చిత్రం.. ఇన్‌శాట్-3డిఆర్ ఉపగ్రహం